By: ABP Desam | Updated at : 25 Aug 2021 02:11 PM (IST)
తనని తాను సిండ్రెల్లాతో పోల్చుకున్న సమంత
'ఏ మాయ చేశావే' తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి మాయచేసిన సమంత నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. మరోవైపు వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టి.. సాకీ పేరుతో ఫ్యాషన్ బిజినెస్‌ను నడిపిస్తూనే స్కూల్ కూడా నడిపిస్తోందీ. అదేసమయంలో సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కెరీర్, వ్యాపారాలకు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకోవడం సామ్‌కు అలవాటు. తన ఫొటో షూట్‌లకు సంబంధించిన ఫొటోలను, తన అభిరుచులను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర ఫొటోను పోస్ట్ చేసింది.
Also Read: మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్.. కొడుకు కోసం రాత్రికి రాత్రే..
తనను తాను సిండ్రెల్లా పాత్రతో పోల్చుకున్న సమంత ఒక ఫొటోను పోస్ట్ చేసింది. కాలికి చెప్పు ఊడిపోయినట్లు ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘సిండ్రిల్లా అండ్ మిస్సింగ్ హర్ స్లిప్పర్’ను ప్రస్తావించింది. రాకుమారి కేవలం తన పెంపుడు శునకం విషయంలోనే సంతోషంగా ఉంటుందంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించింది. అంతేకాకుండా ప్రతీ రోజూ ఇంట్లో చేసే పని ఇదేనంటూ హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది.
Also Read: చిక్కుల్లో హీరోయిన్ సంజన, రాగిణి.. డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు
ఇక సామ్ తాజా ప్రాజెక్ట్ విషయానికొస్తే గుణ శేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది సామ్. పౌరాణిక బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను చూపించనున్నారు. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుంచి దీన్ని తీసుకున్నామని చెప్పాడు గుణశేఖర్. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించాడు. ఈ సినిమాలో మరో విశేషం ఏమంటే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతదర్శకుడు.
Also Read: మెగాస్టార్‌తో మెహర్ రమేష్.. ఈ ఫ్లాప్ చిత్రాల దర్శకుడు ఈసారైనా హిట్ కొడతాడా?
Also Read: ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్.. పాపం అదొక్కటే తక్కువట, ఆ 4 అక్షరాలతో తంట!
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
Akhil Sardhak: ఆ విషయంలో ‘అఖిలే నెంబర్ వన్’, సీజన్-4 హిస్టరీ రిపీట్, కానీ..
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే
Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?