Prakash Raj: మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్.. కొడుకు కోసం రాత్రికి రాత్రే..

మా నాన్నకి జరగాలి మళ్లీ పెళ్లి అని ఆ బుడ్డోడు ఆలోచించాడట. కొడుకు కోరిందే తడవుగా ఆ కోరిక తీర్చేశాడు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. మళ్లీ మళ్లీ పెళ్లేంటి అంటారా... చూడండి మీకే అర్థమవుతుంది.

FOLLOW US: 

సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. ఏం చేసినా సంచలనమే. అయినా సామాన్యుల ఇళ్లలో కనిపించని కొన్ని చిత్ర విచిత్రాలు సెలబ్రెటీల ఇళ్లలో జరుగుతుంటాయి. ఈ కోవకు చెందిందే ప్రకాశ్ రాజ్ మళ్లీ పెళ్లి. ఈ మధ్యే కదా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు.. మళ్లీ పెళ్లేంటి? ఈ మధ్యనే కదా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు అనేగా మీ సందేహం. అసలేం జరిగిందో చూడండి. 

ప్రకాశ్‌ రాజ్‌ తన మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కొరియోగ్రాఫర్‌ పోనీవర్మని 2010లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం పలు మూవీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రకాశ్ రాజ్ బిజీగా ఉన్నారు. కె.జి.యఫ్ చాప్టర్ 2, అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రాలతో పాటు రజినీకాంత్‌ ‘అన్నాత్తే’ చిత్రాలతో కూడా ప్రకాశ్ రాజ్ బిజీగా ఉన్నారు.

కొద్ది రోజుల కిందట ఓ తమిళ సినిమా షూటింగ్‌లోె గాయపడిన ప్రకాశ్ రాజ్ హైదరాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.  ఇటీవలే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆగస్టు 24న తన పెళ్లి రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకను చూస్తుంటే.. ప్రకాశ్ రాజ్ గాయాల నుంచి కోలుకున్నట్టే కనిపిస్తోంది. అయితే, ప్రకాశ్ రాజ్ రాత్రికి రాత్రే మరోసారి తన భార్యను పెళ్లి చేసుకోవలసి వచ్చింది. అదేంటీ అల్రెడీ పెళ్లి చేసుకున్నారు కదా.. మళ్లీ పెళ్లేంటి అనేగా మీ సందేహం. అయితే, ఏం జరిగిందో చూడాల్సిందే. 

ప్రకాశ్ రాజ్ మళ్లీ ఎవరిని పెళ్లి చేసుకున్నారనే సందేహం మీకు వచ్చిందా? అందరదీ అదే పరిస్థితి. అయితే ఆయన పెళ్లి చేసుకున్నది మరెవ్వరినో కాదు.. తన భార్య పోనీవర్మనే. ‘‘మేమిద్దరం పెళ్లి చేసుకొని పదకొండేళ్లు కావటంతో పెళ్లిరోజు సెలబ్రేషన్స్‌ చేసుకున్నాం. ఈ సందర్భంగా మా కొడుకు వేదాంత్ మా పెళ్లిని చూడలేదని అన్నాడు. అతడి కోరిక మేరకు రాత్రికి రాత్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాం’’ అని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూసి నెటిజనులు ప్రకాశ్ రాజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

‘మా’ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తప్పకుండా ‘మా’ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ప్రకాశ్ రాజ్ పట్టుబడుతున్న నేపథ్యంలో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అయితే, చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు ప్రకాశ్ రాజ్‌కు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: ఫ్యామిలీ హీరో ఇంత భయంకరంగా మారాడా... ప్రభాస్ సలార్ మూవీలో జగ్గుభాయ్ లుక్ చూశారా..!

Also Read: ఇచ్చట వాహనాలు నిలుపరాదు ట్రైలర్.. ఏరియాకు కొత్తయితే కొట్టేస్తారా?

Also Read: బీచ్‌లో సన్యాసిని హొయలు.. అంతా మట్టేగా అనుకునేరు..!

Published at : 25 Aug 2021 11:28 AM (IST) Tags: actor prakash raj got married third time with poni varma Prakshraj son photo goes viral

సంబంధిత కథనాలు

Mega154: చిరు సినిమా నుంచి మాస్ హీరో తప్పుకున్నాడా?

Mega154: చిరు సినిమా నుంచి మాస్ హీరో తప్పుకున్నాడా?

Kangana Ranaut: మా నిర్మాత ఆఫీసు అమ్ముకోలేదు - బాలీవుడ్ మీడియాపై కంగనా రనౌత్ ఫైర్

Kangana Ranaut: మా నిర్మాత ఆఫీసు అమ్ముకోలేదు - బాలీవుడ్ మీడియాపై కంగనా రనౌత్ ఫైర్

Prabhas: ప్రభాస్ 'రాధేశ్యామ్' - టీవీలోనూ వర్కవుట్ కాలేదే!

Prabhas: ప్రభాస్ 'రాధేశ్యామ్' - టీవీలోనూ వర్కవుట్ కాలేదే!

Ennenno Janmala Bandham: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి

Ennenno Janmala Bandham: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి

Ram Charan: క‌మెడియ‌న్‌ను తనతో పాటు ఓన్ ఫ్లైట్‌లో హైదరాబాద్ తీసుకొచ్చిన రామ్ చరణ్

Ram Charan: క‌మెడియ‌న్‌ను తనతో పాటు ఓన్ ఫ్లైట్‌లో హైదరాబాద్ తీసుకొచ్చిన రామ్ చరణ్

టాప్ స్టోరీస్

Auto Insurance new Rules: వాహన బీమా రూల్స్‌ ఛేంజ్‌! ఎన్ని కి.మీ. తిప్పితే అంతే ప్రీమియం!

Auto Insurance new Rules: వాహన బీమా రూల్స్‌ ఛేంజ్‌! ఎన్ని కి.మీ. తిప్పితే అంతే ప్రీమియం!

Raghurama Letter : సీఎం జగన్‌ నుంచి ప్రాణహానీ - ఎంపీలు అందరికీ లేఖలు రాసిన రఘురామ !

Raghurama Letter :  సీఎం జగన్‌ నుంచి ప్రాణహానీ - ఎంపీలు అందరికీ లేఖలు రాసిన రఘురామ !

Maayon Telugu Movie Review - 'మాయోన్' రివ్యూ: శ్రీకృష్ణ మాయ నిజమా? కల్పితమా? ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Maayon Telugu Movie Review - 'మాయోన్' రివ్యూ: శ్రీకృష్ణ మాయ నిజమా? కల్పితమా? ఈ మైథలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Redmi K50i: రెడ్‌మీ కే50ఐ వచ్చేది ఆరోజే - అధికారికంగా ప్రకటించిన కంపెనీ!

Redmi K50i: రెడ్‌మీ కే50ఐ వచ్చేది ఆరోజే - అధికారికంగా ప్రకటించిన కంపెనీ!