(Source: ECI/ABP News/ABP Majha)
Jagapathi Babu in Salar: ఫ్యామిలీ హీరో ఇంత భయంకరంగా మారాడా...ప్రభాస్ సలార్ మూవీలో జగ్గుభాయ్ లుక్ చూశారా..!
KGFతో సంచలనం సృష్టించిన ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరెక్కుతోన్న మూవీ సలార్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి లీకైన ప్రభాస్ లుక్ చూసి ఫిదా అయిన ఫ్యాన్స్ తాజాగా రిలీజైన జగ్గుభాయ్ లుక్ చూసి వామ్మో అంటున్నారు.
అత్యంత భారీ తారాగణంతో రూపొందించిన KGF, KGF2కి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న మూవీ సలార్. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినషన్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆన్ లొకేషన్ నుంచి ప్రభాస్ లుక్ లీకులు అందగా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. తాజాగా సలార్ నుంచి రిలీజైన జగపతి బాబు లుక్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.
జగపతిబాబు సలార్‌లో రాజమన్నార్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రల్లో ఒకటిగా ప్రచారమవుతోంది. అతడి గెటప్ చూస్తుంటే క్రూరమైన విలన్‌గా నటిస్తున్నాడని అర్థమవుతోంది. మాసిన గడ్డం మీసకట్టు, చెదిరిన తలతో భృకుటి ముడివేసి ముడుతలు పడిన ముఖంతో జగపతిబాబు లుక్ మొత్తం మారిపోయింది. ముక్కుకు ముక్కెర పెట్టుకుని చుట్ట తాగుతూ క్రూరంగా కనిపిస్తున్నాడు.
కేజీఎఫ్ స్థాయిని మించి యాక్షన్ సన్నివేశా లు
KGF సిరీస్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ .. హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్లో ఇది మూడో సినిమా. కీలక షెడ్యూల్ ని ఇటీవల పూర్తి చేశారు. ఫిబ్రవరి 2022 నాటికి మొత్తం సినిమా పూర్తవుతుంది. ఈ సంవత్సరం చివరిలోగా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామంటున్నారు. హోంబలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ఇప్పటికే రెట్రో స్టైల్లో ఇది మాస్ స్టోరీతో తెరకెక్కుతోందన్న సమాచారం లీకైంది. కేజీఎఫ్ స్థాయిని మించి యాక్షన్ సన్నివేశా లు హైటైట్ గా ఉంటాయని ప్రచారం సాగడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
Also Read: ఇచ్చట వాహనాలు నిలుపరాదు ట్రైలర్.. ఏరియాకు కొత్తయితే కొట్టేస్తారా?
సలార్ కథేంటి?
ఇది 1971 లో జరిగిన ఇండో-పాక్ వార్ స్టోరీ అని సమాచారం. ఆ కథను ఆధారంగా చేసుకుని స్క్రిప్ట్ ని పూర్తిగా సినిమాటిక్ గా మలిచినట్లు తెలిసింది. 1971 వార్ లో ఎన్నో ఆసక్తికర అంశాలున్నాయి. ఆ యుద్ధం ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. 54 మంది భారత జవాన్లను పాక్ నిర్భందించింది. వీరిలో 27 మంది ఆర్మీ సైనికులు.. 24 మంది వైమానిక దళ సిబ్బంది తో పాటు ఒక బీ.ఎస్.ఎఫ్ జవాన్ ఉన్నారు. నిజానికి ఇంత మంది భారత సైనికులు పాక్ చెరలో ఉన్నారని భారత ప్రభుత్వానికి కొంత కాలం వరకూ తెలియదు.
Also Read: చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకున్న RX100 హీరో కార్తికేయ, ఫొటోలు వైరల్
ఇప్పటికీ మిస్టరీనే
పాక్ వారిని ఇంకా బంధీలుగా ఉంచిందా? లేక హత్య చేసి పగ తీర్చుకుందా? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. ఇరు దేశాల మధ్య ఈ వివాదం అప్పుడప్పుడు రగులుతూనే ఉంటుంది. భారత అధికారులతో పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ఈ విషయాన్ని సైతం వెల్లడించారు. భుట్టో రచించిన పుస్తకాల్లో సైతం ఈ విషయాన్ని పొందుపరిచారు. మరి స్టార్ మేకర్ ప్రశాంత్ నీల్ సరిగ్గా ఇదే పాయింట్ ని టచ్ చేస్తున్నారా? లేక వార్ లో ఇంకా అంతర్గత విషయాల్లోకి వెళ్లబోతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. కేజీఎఫ్ కూడా కోలార్ గనుల బ్యాక్ డ్రాప్ లో జరిగిన రియల్ స్టోరీనే తెరపైకి తీసుకొచ్చారు. అద్భుతమైన మేకింగ్ తో స్టార్ క్యాస్టింగ్ తో సినిమాని ఓ రేంజ్ లో చూపించారు. ఈ నేపథ్యంలో సలార్ అంతకు మించి ఉండబోతుందా? అన్న ప్రచారం అంతకంతకు హీట్ పెంచుతోంది. ఇది బార్డర్ వార్ నేపథ్యంలో దేశభక్తి చిత్రంగా ఉండనుంది. ఇందులో ప్రభాస్ దేశభక్తుడిగా కనిపిస్తారా? స్పై తరహా పాత్రలో నటిస్తారా? లేక ఆర్మీ అధికారినా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Reda: కేజీఎఫ్ ఛాప్టర్ - 2 రిలీజ్ డేట్ వచ్చేసింది... కానీ, ట్విస్టు ఏంటంటే...
Also Read: ఓటీటీలో బాబాయ్ అబ్బాయ్ వెంకీ - రానా సందడి... ఈసారి పూర్తి స్థాయిలో ప్లాన్!
Also Read:ఇప్పటి వరకు బన్నీతో గొడవ పడ్డ ఆ నటుడు ఇకపై చెర్రీతో ఫైట్‌కు రెడీ అవుతాడట!