Ram Charan Movie: ఇప్పటి వరకు బన్నీతో గొడవ పడ్డ ఆ నటుడు ఇకపై చెర్రీతో ఫైట్‌కు రెడీ అవుతాడట!
మెగా కాంపౌండ్ లోకి ఒక్కసారి అడుగుపెడితే చాలు ఆఫర్లు వెతుక్కోవాల్సిన అవసరం లేదంటారు. హీరోయిన్ అయినా విలన్ అయినా..క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా. ఇప్పుడు ఆ లిస్టులో చేరాడు పహద్ ఫాజిల్
శంకర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. చెర్రీ కెరీర్ లో 15వ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలసి నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లబోయే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో...నటీనటుల ఎంపిక కూడా అదే స్థాయిలో ఉంటోందని టాక్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు విలన్ రోల్ కి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రతినాయకుడి పాత్ర కోసం మలయాళ నేచురల్ స్టార్ ఫహద్ ఫాజిల్ ని మేకర్స్ సంప్రదిస్తున్నారని అంటున్నారు.
'ట్రాన్స్' 'అనుకోని అతిథి' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఫహద్ ఫాజిల్. ముఖ్యంగా ట్రాన్స్ సినిమాలో ఫహద్ నటన చూసి ఫిదాకానివారు లేరు. వామ్మో ఆ పాత్రకు మరెవ్వరూ ఈ స్థాయిలో న్యాయం లేరని ఫిక్సైపోయారు. ఇక అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప'తో టాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే సినిమాలో ఫహాద్ మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పుడు శంకర్ - చరణ్ మూవీలోనూ ఫాజిల్ నే తీసుకుందామని ఫిక్సైనట్టు టాక్. ఇదే నిజమైతే 'RC15' లో రామ్ చరణ్ కు ధీటుగా ఫాజిల్ రోల్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే శంకర్ తన సినిమాల్లో విలన్ క్యారెక్టరైజేషన్ ని స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేస్తుంటాడు. పైగా ఇదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే విలక్షణ నటుడు ఇందులో పొలిటికల్ లీడర్ గా కనిపించే ఛాన్స్ ఉంది. ఫహాద్ ఫాజిల్ డేట్స్ అడ్జస్ట్ చేసిన వెంటనే.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.
సెప్టెంబర్ 8 నుంచి చరణ్ - శంకర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ హడావుడి పూరైన వెంటనే...ఆచార్యలో పెండింగ్ సాంగ్ చిత్రీకరణలో బిజీ కానున్నాడు చరణ్. తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసే యోచనలో ఉన్నారు శంకర్ అండ్ టీమ్...
ఈ మూవీకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు, సాయిమాధవ్ బుర్రా డైలాగ్ రైటర్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. ఇది దిల్ రాజు బ్యానర్ లో వచ్చే 50వ సినిమా. అన్నటికీ మించి శంకర్ దర్శకత్వంలో వస్తున్న మొదటి తెలుగు ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి....
Also Read: ట్రిపుల్ ఆర్ విడుదల వాయిదా? రాజమౌళి పెట్టబోయే ప్రెస్‌మీట్ అందుకేనా?
Also Read: శ్రీదేవి సోడా సెంటర్‌లో గోలీ కొట్టిన మహేశ్ బాబు.. అదిరిపోయిందంటూ ట్వీట్
Also Read: అభిమాని చర్యకు చలించిపోయిన ప్రకాశ్‌రాజ్.. త్వరలోనే కలుస్తానని హామీ
Also Read: బాత్ టబ్‌లో విరిసిన ఎర్రగులాబీ.. తల్లి వల్ల సెలబ్రెటీగా మారిన తనయ...
Also Read: సముద్రం మధ్యలో రామ్ చరణ్ బ్యూటీ అందాల విందు