MAA Election 2021: అభిమాని చర్యకు చలించిపోయిన ప్రకాశ్‌రాజ్.. త్వరలోనే కలుస్తానని హామీ
అభిమాన నటుల కోసం పాదయాత్ర చేయడం ఈ మధ్య ఇదో ట్రెండ్ గా మారింది. లెటెస్ట్ గా ప్రకాశ్ రాజ్ కోసం ఓ అభిమాని పాదయాత్ర చేయాలని సంకల్పించాడు...ఈ విషయం తెలిసి ప్రకాశ్ రాజ్ ఏమ్నాన్నాడంటే...
అభిమానానికి హద్దనేదే ఉండదంటారు. ముఖ్యంగా తాము అభిమానించే నటీనటుల కోసం రక్తదానం, అన్నదానంతో పాటూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. కొందరికి ఏకంగా గుడి కట్టించి దేవుడిలా పూజిస్తుంటారు. అయితే ఈ మధ్య అభిమాన నటీనటుల కోసం పాదయాత్ర చేయడం అనేది లేటెస్ట్ ట్రెండ్ అయింది. అల్లు అర్జున్, రామ్ చరణ్, సోనూసూద్ వంటి వారి కోసం పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేసి.. చివరికి వారిని కలుసుకుని కొందరు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కోసం ఓ అభిమాని సుమారు 485 కి.మీ. పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు.
రాజమండ్రి రూరల్ కోలమూరుకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ పల్లీ రంజిత్ కుమార్.. ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ విజయం సాధించాలని కోరుతూ.. తన స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఈ విషయం తెలుసుకున్న ప్రకాశ్ రాజ్.. వెంటనే స్పందించి తన కోసం పాదయాత్ర వద్దని వారించారు. త్వరలోనే వ్యక్తిగతంగా కలుస్తానని మాటిచ్చిన ప్రకాశ్ రాజ్... ‘రంజిత్ బంగారం.. నిస్వార్థంతో కూడిన మీలాంటి వారి అభిమానమే కళాకారుడిగా నన్ను ముందుకు నడిపిస్తోంది. మీ ప్రయత్నం నా మనసుకు బాధ కలిగిస్తోంది. నా మాటగా తిరిగి మీరు ఇంటికి వెళ్లి ఆనందంగా ఉండాలని కోరాడు. త్వరలోనే వ్యక్తిగతంగా కలసి మాట్లాడతానని ప్రకాశ్ రాజ్ మాట ఇవ్వడంతో రంజిత్ తన నిర్ణయాన్ని విరమించుకున్నారు.
ప్రకాశ్ రాజ్ ఏమని ట్వీట్ చేశారంటే..
అంతకుముందు పాదయాత్ర వద్దని వారించిన వారితో రంజిత్ ఏమన్నాడంటే...
‘‘సారీ సార్.. నేను వెనక్కి వెళ్లలేను. నేను అమితంగా గౌరవించే వ్యక్తులు ఇద్దరు. ఒకటి ‘శ్రీశ్రీ’గారు. రెండు ప్రకాశ్ రాజ్‌గారు. శ్రీశ్రీగారికి నేను మొక్కుకున్నాను. ఎలాగైనా ప్రకాశ్ రాజ్ సార్‌ని గెలిపించాలని. నాకు అంత స్థాయి లేకపోయినా.. గెలవడానికి పాదయాత్ర చేయాలని బలంగా ఫిక్సయ్యాను. వద్దని వాదించినా సరే.. కచ్చితంగా పాదయాత్ర చేస్తాను. ప్రకాశ్ రాజ్ సార్‌పై నాకంత గౌరవం ఉంది. పాదయాత్ర ముగించుకుని సార్‌ని ఒకసారి కలవాలి. అదే నా ప్రయత్నం అన్నాడు. చివరికి ప్రకాశ్ రాజ్ కలుగజేసుకుని..నచ్చచెప్పడంతో ఫైనల్‌గా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు రంజిత్.
Also Read: భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్
Also Read: పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?
Also Read:శ్రీదేవి సోడా సెంటర్‌లో గోలీ కొట్టిన మహేశ్ బాబు.. అదిరిపోయిందంటూ ట్వీట్
Also Read: యంగ్ టైగర్ గ్యారేజ్‌లోకి ఖరీదైన లగ్జరీ కార్, ఇండియాలోనే ఫస్ట్ ఇది.. ధర తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..