News
News
X

Karthikeya Engagement: చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకున్న RX100 హీరో కార్తికేయ, ఫొటోలు వైరల్

చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకున్నాడు RX 100 హీరో కార్తికేయ. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

యంగ్ హీరోలు ఒక్కొక్కరు ఓ ఇంటివారైపోతున్నారు. ఇప్పుడా లిస్టులో చేరాడు కార్తికేయ. 2018లో అజయ్ భూపతి దర్శకత్వంలో మంచి సక్సెస్ అందుకున్న సినిమా ఆర్ ఎక్స్ 100. ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు కార్తికేయ. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న కార్తికేయ నిశ్చితార్థం చేసుకున్నాడు.

నిశ్చితార్థం ఇంత సీక్రెట్ గా చేసుకోవడం ఎందుకంటున్నారు అభిమానులు. అందరికీ సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేశాడట కార్తికేయ. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌లో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులతోపాటు అతి తక్కువ మంది సన్నిహితులు హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం కార్తికేయ నిశ్చితార్థానికి హాజరై అభినందనలు తెలిపారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు కార్తికేయ మనువాడబోయే అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2017లో ‘ప్రేమతో మీ కార్తీక్‌’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. మొదటి సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందించలేకపోయింది. అనంతరం వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ సూపర్‌హిట్‌ అయింది. ఆ తర్వాత నుంచి వరుస ఆఫర్లు అందిపుచ్చుకున్నాడు కార్తికేయ గుమ్మకొండ. ఈ మధ్యే కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా రిలీజైంది. తెలుగుతో పాటూ అటు తమిళంలోనూ  నటిస్తున్నాడు. కేవలం హీరో రోల్స్‌ మాత్రమే కాకుండా ప్రతినాయకుడిగాను మెప్పిస్తున్నాడు. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్‌లీడర్‌’లో కార్తికేయ విలన్‌గా నటించాడు. అజిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘వలిమై’లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తెలుగులో `రాజా విక్రమార్క`తో బిజీగా ఉన్నాడు. 

సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్న కార్తికేయ త్వరలోనే పెళ్లిపై అధికారికంగా ప్రకటించనున్నాడు. అయితే అమ్మాయి గురించి పెద్దగా వివరాలు తెలియకపోవడంతో... ఆమె వివరాలపై ఆరా మొదలుపెట్టారు నెటిజన్లు.

Also Reda: ‘మా’ భవనానికి స్థలం చూశా.. నాగబాబు సవాల్‌కు విష్ణు జవాబ్ ఇదేనా? కన్నెందుకు కొట్టావంటూ ట్రోల్స్

Also Reda: కేజీఎఫ్ ఛాప్టర్ - 2 రిలీజ్ డేట్ వచ్చేసింది... కానీ, ట్విస్టు ఏంటంటే...

Also Read: బ్రేక్‌టైమ్‌లో గన్ ఎక్కుపెట్టిన పవర్ స్టార్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు

Also Read: ఓటీటీలో బాబాయ్ అబ్బాయ్ వెంకీ - రానా సందడి... ఈసారి పూర్తి స్థాయిలో ప్లాన్!

Also Read:ఇప్పటి వరకు బన్నీతో గొడవ పడ్డ ఆ నటుడు ఇకపై చెర్రీతో ఫైట్‌కు రెడీ అవుతాడట!

Published at : 23 Aug 2021 12:33 PM (IST) Tags: Hyderabad Karthikeya RX100 Hero Karthikeya Gets Engaged Kartikeya Gummakonda close friends

సంబంధిత కథనాలు

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా,  రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా, రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

టాప్ స్టోరీస్

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!