News
News
X

Pawan Kalyan: బ్రేక్‌టైమ్‌లో గన్ ఎక్కుపెట్టిన పవర్ స్టార్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు

భీమ్లానాయక్ బ్రేక్ టైం అంటూ మూవీ యూనిట్ విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడీ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ బ్రేక్ టైంలో ఏం చేస్తున్నాడో చూడండి.

FOLLOW US: 

పవన్ కళ్యాణ్ -  రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ''భీమ్లా నాయక్''. మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కొషియుమ్'కి రీమేక్ ఇది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే రెండు రోజులుగా భీమ్లానాయక్ విడుదల పోస్ట్ పోనే అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలొచ్చాయి. వీటికి క్లారిటీ ఇచ్చేందుకే టార్గెట్ ఫిక్స్ చేస్తూ గన్ ఎక్కుపెట్టిన పవన్ కళ్యాణ్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 

చిరంజీవి 'ఆచార్య' సినిమా జనవరి 13న రిలీజ్ చేయాలని భావిస్తున్నారని.. ఈ మేరకు దర్శక నిర్మాతలు 'భీమ్లా నాయక్' మేకర్స్ తో చర్చలు జరిపారని టాక్ వచ్చింది. అంతేకాదు 'భీమ్లా నాయక్' ని రిపబ్లిక్ డే వీక్ కు వాయిదా వేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. దీంతో భీమ్లానాయక్ చిత్ర నిర్మాతలు మరోసారి సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు.  ఈ మేరకు 'బ్రేక్ టైమ్ ఇన్ భీమ్లా నాయక్' అనే పేరుతో పవన్ కు సంబంధించిన ఓ స్మాల్ వీడియోని చిత్ర బృందం వదిలింది. ఈ సందర్భంగా 'భీమ్లా నాయక్' సినిమా 2022 జనవరి 12న రాబోతోందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా పవన్ - రానా ల సినిమా వాయిదా పడుతుందనే వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.

ఇంతకీ వీడియోలో ఏముందంటే.. పవన్ కల్యాణ్ చేతిలో పెద్ద గన్ పట్టుకుని కాల్పులు జరుపుతున్నాడు. స్టైల్ గా కారు మీద కాలు పెట్టి ఫైరింగ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. సాధారణంగా పవన్ ప్రతి సినిమాలోనూ ఏదోఒక సందర్భంలో తుపాకీ పట్టుకుని కనిపిస్తుంటాడు. భీమ్లానాయక్ కి సంబంధించి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారని సమాచారం. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నాడు. పవన్ సరసన నిత్యామీనన్ - రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మాత. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఈ వీడియోపై బండ్లగణేశ్ ఏమన్నాడంటే..:

Also Read:పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?

Also Read:భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్

Also Read: ఓటీటీలో బాబాయ్ అబ్బాయ్ వెంకీ - రానా సందడి... ఈసారి పూర్తి స్థాయిలో ప్లాన్!

Also Read:ఇప్పటి వరకు బన్నీతో గొడవ పడ్డ ఆ నటుడు ఇకపై చెర్రీతో ఫైట్‌కు రెడీ అవుతాడట!

Published at : 21 Aug 2021 03:42 PM (IST) Tags: pawan kalyan Bheemla Nayak Pk In Break Time Blazing Guns Watch VIDEO

సంబంధిత కథనాలు

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ -  ఇందులో నిజమెంతా?

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ - ఇందులో నిజమెంతా?

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Oscars 2023: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ - రాజమౌళి సినిమాకు అవార్డు గ్యారెంటీ అంటున్న మరో టాప్ సైట్!

Oscars 2023: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ - రాజమౌళి సినిమాకు అవార్డు గ్యారెంటీ అంటున్న మరో టాప్ సైట్!

అనసూయను చూస్తే తన క్రష్ గుర్తొచ్చిందన్న దర్శకేంద్రుడు - విష్ణు ప్రియకు రెండు పెళ్లిలట!

అనసూయను చూస్తే తన క్రష్ గుర్తొచ్చిందన్న దర్శకేంద్రుడు - విష్ణు ప్రియకు రెండు పెళ్లిలట!

Anasuya: ఇండస్ట్రీలో ఆడవాళ్లు మాట్లాడకూడదు, గిల్లితే గిల్లించుకోవాలి - అనసూయ కామెంట్స్!

Anasuya: ఇండస్ట్రీలో ఆడవాళ్లు మాట్లాడకూడదు, గిల్లితే గిల్లించుకోవాలి - అనసూయ కామెంట్స్!

టాప్ స్టోరీస్

KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

KTR :  ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!