IVNR Trailer: ఇచ్చట వాహనాలు నిలుపరాదు ట్రైలర్.. ఏరియాకు కొత్తయితే కొట్టేస్తారా?
త్రివిక్రమ్ `అల వైకుంఠపురములో` మూవీలో ఓ కీలక పాత్రలో నటించిన సుశాంత్ తాజా మూవీ ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశాడు కింగ్ నాగార్జున.
సెన్సార్ సహా అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకున్న ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రమోషన్లో వేగం పెంచిన టీమ్ తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. ఆసక్తికరమైన కథ కథనంతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉందంటున్నారు సినీ ప్రియులు. ఎస్ దర్శన్‌కు మొదటి సినిమా అయినప్పటికీ అన్ని కమర్షియల్ అంశాలతో తెరక్కించాడని అంటున్నారు.
Also Read: ఆర్జీవీ అదేం పని.. నటితో రొమాంటిక్ డ్యాన్స్, వైరల్ వీడియోలో ఉన్న ఆమె ఎవరు?
క్రైమ్, సస్పెన్స్, థ్రిల్, లవ్ ఇలా అన్నీ మిక్స్ చేసినట్టు అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. హీరో సుశాంత్ ను ఇబ్బందుల్లోకి నెట్టిన సంఘటన ఏంటో క్లారిటీగా చూపించకపోయినా.. చిక్కుల్లో పడతాడన్నది మాత్రం అర్థమవుతోంది. ఒక కాలనీలో గందరగోళం జరుగుతుంది. అప్పటి వరకు సంతోషకరమైన జీవితాన్ని గడిపిన సుశాంత్ తరువాత గూండాలు పోలీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. మీనాక్షి చౌదరి అతడి స్నేహితురాలుగా కనిపించనుంది. అమాయకుడిగా కనిపిస్తూనే సమస్యను డీల్ చేసే వాడిగా సుశాంత్ బాగానే నటించాడంటున్నారు సినీ ప్రియులు.
Also Read: చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకున్న RX100 హీరో కార్తికేయ, ఫొటోలు వైరల్
ప్రముఖ నటి భానుమతి మనవడు రవిశంకర్ శాస్త్రి - ఏక్తా శాస్త్రి - హరీష్ కొయ్యలగుండ్ల ఈ చిత్రాన్ని AI స్టూడియోస్ & శాస్త్రా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్ , ప్రియదర్శి, అభనవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’ ఫేం వెంకట్ చాలా రోజుల తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించాడు. ఈ చిత్రంలో వెంకట్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఆగస్ట్ 27న సినిమా విడుదల కానుంది. మరి ‘చి.ల.సౌ’తో మెప్పించి.. ‘అలవైకుంఠం పురంలో’ మంచి మార్కులే సంపాదించుకున్న సుశాంత్ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ఇచ్చట వాహనాలు నిలుపరాదు ట్రైలర్:
ALso Read: శృంగారం లేకుండా ఉండగలవా? అభిమాని ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబిచ్చిన శృతి హాసన్
Also Reda: కేజీఎఫ్ ఛాప్టర్ - 2 రిలీజ్ డేట్ వచ్చేసింది... కానీ, ట్విస్టు ఏంటంటే...
Also Read: ఓటీటీలో బాబాయ్ అబ్బాయ్ వెంకీ - రానా సందడి... ఈసారి పూర్తి స్థాయిలో ప్లాన్!
Also Read:ఇప్పటి వరకు బన్నీతో గొడవ పడ్డ ఆ నటుడు ఇకపై చెర్రీతో ఫైట్‌కు రెడీ అవుతాడట!