News
News
వీడియోలు ఆటలు
X

RGV dance: ఆర్జీవీ అదేం పని.. నటితో రొమాంటిక్ డ్యాన్స్, వైరల్ వీడియోలో ఉన్న ఆమె ఎవరు?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వైరల్ అయ్యారు. ఈ సారి పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న ఓ నటితో రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ.. ఆశ్చర్యపరిచారు.

FOLLOW US: 
Share:

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలను ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. అయితే, అదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఆయన సినిమాలు కంటే ఆయనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు. ఇన్ని రోజులు నటులు, రాజకీయ నాయకులపై విమర్శలు, బోల్డ్ సినిమాలతో చర్చనీయమైన ఆర్జీవీ.. ఇప్పుడు అమ్మాయిలతో చనువుగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన విషయాలను సైతం బహిరంగంగా మాట్లాడుతూ.. షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇటీవల.. బిగ్‌బాస్ తెలుగు మాజీ కంటెస్టంట్ అషూరెడ్డిని అభ్యంతకరంగా వీడియో తీసి అభిమానులు ముక్కున వేలు వేసుకొనేలా చేశారు. 

తాజాగా ఇనాయ సుల్తానా అనే నటితో ఏకంగా రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ మరోసారి ఆర్జీవీ.. స్వేచ్ఛాజీవి అనిపించుకున్నారు. ఇయాన పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న ఆర్జీవి మద్యం మత్తులో ఉన్నారో.. లేదా రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారో తెలియదుగానీ ఆమెను ఇబ్బంది పెట్టేలా డ్యాన్స్ చేశారు. ఆమెకు దన్నం పెడుతూ.. చుట్టూ ప్రదక్షిణ చేశారు. చివరికి ఆమె కాళ్లపై కూడా పడ్డారు. ఈ వీడియోలో నటులు జ్యోతి, శ్రీకాంత్ అయ్యంగార్‌కు కూడా ఉన్నారు. అయితే.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ బుకాయించారు. అషూరెడ్డి వీడియో విషయంలో కూడా ఆర్జీవీ ఇలాగే ప్రవర్తించారు. ఇప్పుడు కూడా సుల్తానాతో డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేస్తూ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, ఆ రెడ్ డ్రస్‌లో ఉన్నది కూడా ఇనాయ సుల్తానా కాదని.. అమెరికా అధ్యక్షుడు బిడెన్ మీద ఒట్టని పేర్కొన్నారు. అయితే, ఈ వీడియో చూసిన నెటిజనులు.. ఆర్జీవీని ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియోలో ఉన్న నటి ఇనాయ సుల్తానా ‘బుజ్జి ఎలారా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 21 పుట్టిన రోజు సందర్భంగా ఆమె కేక్ కటింగ్ పార్టీకి ఆర్జీవి వచ్చి.. ఇలా సందడి చేశారు. 

‘‘మీరు ఆర్జీవీ కాదు.. స్వేచ్ఛాజీవి’’ అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ‘‘గురూజీ మీ పేరు చెడగొడుతున్న ఆ వీడియోలో ఉన్న జీవిని ఎలాగైనా పట్టుకుంట. మీ మీద ఒట్టు. రోడ్ మీద పర్సు కొట్టి పారిపోతున్న జేబు దొంగని సడెన్‌గా పట్టుకున్నట్టు పట్టుకున్నారు ఆ అమ్మాయిని మీరు. సారి మీలాంటి సూపర్ డూప్’’ అని ఒకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. మరొకరు.. ‘‘నిజంగా వాడెవడో అచ్చం మీలాగే ఉన్నాడు సార్. వాడికేం పోయేకాలమో గానీ మీ పరువు తీసేలా ఉన్నాడు. ఏంటి సార్ మరీ కల్లు తాగినా కోతిలా ఆ డాన్సులు ఏంటీ ? కాళ్ళు మొక్కడం ఏంటీ ? ఆ వెకిలి చేష్టలు ఏంటి ? వామ్మో మీరు స్పందించి ఆ జాతిరత్నాన్ని పట్టుకోండి లేదా మీరేమో అనుకొని బ్రమా పడతాం మేమూ’’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.

మొన్నటి వరకు అరియానాతో ‘అడల్ట్’ ఇంటర్వ్యూలో పచ్చిగా మాట్లాడిన వర్మ.. ఇటీవల అషురెడ్డితో జతకట్టారు. ఆమెతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బల్ల కిందకు వంగ తన మొబైల్ కెమేరాతో అషూ రెడ్డి తొడలను షూట్ చేయడం చర్చనీయమైంది. ‘నో అంటే నో అంతే’ అని క్యాప్షన్‌తో అషూరెడ్డి పోస్ట్ చేసిన ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్మ అలా తనని షూట్ చేయడం తనకు ఇష్టం లేదున్నట్లుగా పేర్కొంది. ఈ వీడియోలో ఆర్జీవీ ఆమె తొడలను తన కెమేరాతో రికార్డు చేస్తుంటే.. అషూ మాత్రం వద్దు వద్దు అని చెప్పడం కనిపించింది. ఈ నేపథ్యంలో నెటిజనులు కూడా అషూ రెడ్డిపై కామెంట్లు చేస్తున్నారు. ఆర్జీవీతో ఇంటర్వ్యూ అంటే దుస్తులు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని, అలా పొట్టి దుస్తులు వేస్తే అతడి చూపు అక్కడే ఉంటుందని పచ్చిగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘అతను డైరెక్టర్ కాబట్టి ఏమీ అనలేదు. అదే పని సామాన్యుడు చేసినా.. అలా చూసినా.. కొట్టేసి పెద్ద రాద్దాంతం చేస్తారు’’ అని మరొకరు కామెంట్ చేశారు. 

Published at : 23 Aug 2021 11:00 AM (IST) Tags: Ram Gopal Varma RGV Ram Gopal Varma dance Ram Gopal Varma with Inaya Sultana Inaya Sultana రామ్ గోపాల్ వర్మ

సంబంధిత కథనాలు

Trivikram: సెంటిమెంట్‌ను ఫాలో అవ్వని త్రివిక్రమ్ - ‘గుంటూరు కారం’ ఫలితం ఎలా ఉంటుందో?

Trivikram: సెంటిమెంట్‌ను ఫాలో అవ్వని త్రివిక్రమ్ - ‘గుంటూరు కారం’ ఫలితం ఎలా ఉంటుందో?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !