By: ABP Desam | Updated at : 24 Aug 2021 07:13 PM (IST)
అవును..రాగిణి, సంజనాలు డ్రగ్స్ తీసుకున్నారు
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శాండిల్ వుడ్ డ్రగ్స్ రాకెట్ లో హీరోయిన్స్ సంజన గల్రానీ - రాగిణి ద్వివేదిలను బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ పై విడుదలైన ఈ ఇద్దరు హీరోయిన్లపై ఈ కేసులో ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. రాగిణి - సంజనలు డ్రగ్స్ తీసుకున్నట్లు FSL రిపోర్టులో తేలింది. బెంగళూరు పోలీసులు 2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుకలను FSLకు పంపగా.. ఈ హీరోయిన్లు డ్రగ్స్ సేవించినట్లు నివేదిక ద్వారా స్పష్టమైంది. దీంతో మరోసారి రాగిణి - సంజనలకు సమన్లు జారీ చేయనున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’లో సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్? తెలుగులో తొలిసారిగా..
కన్నడ చిత్ర సీమలో ఎంతోమంది ప్రముఖులు నిషేధిత డ్రగ్ యూజర్లేనని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. రాగిణి ద్వివేది - సంజన గల్రాని లతో పాటు డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురుని సీసీబీ అరెస్టు చేసింది. మాదకద్రవ్యాల వినియోగం - సరఫరా కేసులో సెప్టెంబర్ 7న రాగిణి ద్వివేదిని.. సెప్టెంబర్ 9న సంజనను అరెస్ట్ చేశారు. ఇద్దరూ 3 నెలలకు పైగా బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉండి బెయిల్ పై బయటికి వచ్చారు.
Also Read: 'దృశ్యం' మూవీలో వెంకటేష్ చిన్న కూతురు.. అప్పుడు క్యూట్, ఇప్పుడు హాట్!
డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది - సంజనా గల్రాని తో పాటు మరో 25 మందిపై చార్జిషీట్ ఫైల్ అయింది. 2019 మే 26న రాగిణి ద్వివేది బర్త్ డే పార్టీలో డ్రగ్స్ సరఫరా చేయడం.. ప్రియుడు రవిశంకర్ తో కలసి ఓ హోటల్ లో నిర్వహించిన పార్టీలో ఎక్స్టసీ డ్రగ్ మాత్రలు తీసుకోవడం.. ఇతరులకూ సరఫరా చేయడం వంటి వాటిని ఈ చార్జిషీట్ లో ప్రస్తావించారు. అలానే సంజన కు డ్రగ్స్ వినియోగం, సరఫరాతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు FSL రిపోర్టులో హీరోయిన్లు ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది. తెలుగు ప్రేక్షకులకు రాగిణి పెద్దగా తెలియకపోయినా.. సంజన మాత్రం ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బుజ్జిగాడు’తో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించింది.
Also Read: బీచ్‌లో సన్యాసిని హొయలు.. అంతా మట్టేగా అనుకునేరు..!
Also Read: క్లాస్, మాస్... పాటేదైనా మాధుర్యాన్ని పంచే సింగర్ 'గీతామాధురి'కి జన్మదిన శుభాకాంక్షలు
Hayath Nagar Crime : హయత్ నగర్ లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ అలజడి, గేటెడ్ కమ్యూనిటీలో చోరీ
Vikarabad News : ప్రియుడి ఇంట్లో యువతి ఆత్మహత్యాయత్నం, పెళ్లికి పది లక్షల కట్నం డిమాండ్ చేసిన యువకుడు!
Anantapur News : అనంతలో ఉన్నతాధికారి ఆత్మహత్య, ఉసురు తీసిన ఆన్లైన్ బిజినెస్!
Hyderabad: హైదరాబాద్‌లో చైల్డ్ పోర్న్ ముఠాలు, ఈ 3 ప్రాంతాల నుంచి వీడియోలు అప్లోడ్! అదుపులోకి ముగ్గురు?
Crime News: కూతుళ్లతోనే ప్రియుడి భార్య హత్యకు స్కెచ్- సీరియల్స్ విలన్స్‌కు మించిన కంత్రీ ప్లాన్ ఇది!
Rishi Sunak Profile: ఇంగ్లాండ్ ప్రధాని రేసులో ఇండియా సంతతి వ్యక్తి- రిషి సునక్ ఎవరో తెలుసా?
YSRCP Plenary 2022 : ప్లీనరీ సక్సెస్ చూసి చంద్రబాబు మళ్లీ బోరు బోరున ఏడుస్తారు - ఎంపీ విజయసాయి రెడ్డి
Corona New Variant : భారత్‌లో మరో కొత్తరకం వేరియంట్ - కొత్త వైరస్‌ను కనిపెట్టిన డబ్ల్యూహెచ్‌వో !
IND-W vs SL-W, 3rd ODI: హర్మన్ ప్రీత్ డిస్ట్రక్షన్! లంకను కుప్పకూల్చిన రాజేశ్వరీ, మేఘనా