Nootokka Jillala Andagadu: ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్.. పాపం అదొక్కటే తక్కువట, ఆ 4 అక్షరాలతో తంట!
అవసరాల శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ నూటొక్క జల్లాల అందగాడు ట్రైలర్ విడుదలైంది..
అవసరాల శ్రీనివాస్ నటుడిగా, దర్శకుడిగా తెలుగులో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకి పసందైన వినోదం అందిస్తున్నాడు. అవసరాల హీరోగా 101 జిల్లాల అందగాడు అనే సినిమా తెరకెక్కుతుండగా, ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ‘చిలసౌ.’ సినిమా ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
Also Read: మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్.. కొడుకు కోసం రాత్రికి రాత్రే..
ఇందులో నాలుగు అక్షరాలు అతడిని బాగా వేదిస్తాయి. అదేనండి ‘బ ట్ట త ల’. అవసరాల తన బట్టతలని కవర్ చేసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడనేది ఈ చిత్రంలో ఆసక్తిగా చూపించారు. బట్టతల వలన తాను కొన్ని సందర్భాలలో ఎమోషన్, ఫ్రస్ట్రేట్ కూడా గురవ్వుతాడు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ గొత్తి సత్యనారాయణగా అలరించనున్నారు.
Also Read: చిక్కుల్లో హీరోయిన్ సంజన, రాగిణి.. డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలసిన సంచారి అనే లిరికల్ సాంగ్ కూడా విడుదలచేసింది చిత్రయూనిట్. శ్రీవిశ్వ రచించిన ఈ గీతాన్ని హేమచంద్ర ఆలపించాడు. శక్తికాంత్ కార్తీక్ స్వరాలు సమకూర్చాడు. బాధ నుంచి తేరుకున్న హీరో విజయంవైపు అడుగువేసే సన్నివేశాలతో చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాను తీసుకున్న క్యారెక్టర్ కి పూర్తిస్థాయిలో న్యాయం చేసే అవసరాల శ్రీనివాస్ మరి నూటొక్కజిల్లాల అందగాడుగా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.
Also Read: చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’లో సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్? తెలుగులో తొలిసారిగా..
Also Read: టాలీవుడ్‌లో ‘మెగా’ సందడి.. వరుస చిత్రాలతో చిరు ప్రభంజనం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
Also Read: తల్లి అంజు భవాని బర్త్‌డే వేడుకలో దీపికాతో రణవీర్ సింగ్ హంగామా