Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
తెలంగాణలో పరిణామాలు రేవంత్ రెడ్డి సర్కార్ వర్సెస్ సినీ ఇండస్ట్రీలా మారాయి. అల్లు అర్జున్ ను అడ్డుపెట్టి ఇండస్ట్రీపై పగ సాధిస్తున్నారా? : కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తో ABP దేశం ఇంటర్వ్యూ.
ABP దేశం... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తుందా.. ఎందుకు సినీ ప్రముఖలంటే రేవంత్ రెడ్డికి అంతకోపం..?
రామ్మోహన్ రెడ్డి: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తెలుగు సినీ ఇండస్ట్రీలో రామానాయుడు స్టూడియోకు అనుమతి ఇచ్చాము. బెన్ఫిట్ షోలు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అందుబాటులోకి వచ్చాయి. మేమే అనుమతులిచ్చాం. నిబంధనలు పాటించకపోతే మాకు ఎవరైనా ఒక్కటే. నిబంధనలు ఉల్లంఘిస్తే అది ఎవరైనా ఒక్కటే. మాకు నిర్మాతలు, దర్శకులపై కోపం లేదు. అందరీని ప్రోత్సహించేందుకు సిద్దంగా ఉన్నాము. మనిషి చనిపోెతున్నా పట్టించుకోము, నిబంధనలు పాటించము అంటే అది హీరో అయినా , దర్శకులైనా ఎవరైనా మా ప్రభుత్వం ఉపేక్షించదు.
ABP దేశం.. సంధ్యా థియేటర్ ఘటనలో నిర్లక్ష్యం వాస్తవమే, అయితే అందులో పోలీసుల తప్పు లేదంటారా.. మొత్తానికే బెనిఫిట్ షోలు రద్దు ఎలా చేస్తారు?
రామ్మోహన్ రెడ్డి: బెనిఫిట్ షోలు లేకుండా చేయడం మా ఉద్దేశ్యం కాదు. మేము సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. ఎంతో మంది సినీ ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతున్నారు. చిన్న ఆర్టిస్టుల నుండి వర్కర్లు, థియేటర్ యజమానులు, వ్యాపారులు ఇలా అనేక మంది సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎవరిపైనా మాకు వ్యతిరేకత లేదు. కొందరు వ్యక్తులు కావాాలనే విధివిధానాలు పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.అలా మాకు ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే చూస్తూ ఊరుకోము. ఎవరినీ ఉపేక్షించము.
ABP దేశం.. అల్లు అర్జున్ కు కాలుపోయిందా.. చెయ్యి విరిగిందా.. ఇలా నేరుగా అల్లు అర్జున్ ను వ్యక్తిత్వ హనం చేసేలా సిఎం స్దాయిలో వ్యక్తి ఎందుకు మాట్లడుతున్నారు..?
రామ్మోహన్ రెడ్డి: బాలుడి తల్లి రేవతి స్పాట్ లోనే చనిపోయింది. ఆసుపత్రిలో శ్రీతేజ్ చావు బ్రతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. మరి సినీ ప్రముఖలు ,అల్లు అర్జున్ మాత్రమే పరామర్శించడం కాదు. ఆసుపత్రిలో ఉన్న బాలుడ్ని సైతం చూడాలిగా. కానీ ఎవరూ అలా చూడలేదు. శ్రీతేజ్ గురించి మాట్లాడలేదు. అదే సీఎం రేవంత్ రెడ్డికి బాధ కలిగించింది. సెలబ్రిటీలకు మానవత్వం ఉండాలి కదా. మంత్రి సీతక్కను పంపి ఎప్పటికప్పుడు బాలుడి పరిస్ధితి తెలుసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి ధైర్యం చెప్పిన సినీ ప్రముఖులకు ఆసుపత్రిలో ఉన్న బాలుడి కుటుంబానికి కూడా ధైర్యం చెబితే బాగుండేది అనేది సిఎం అభిప్రాయం.
ABP దేశం: మీరు వాస్తవం చెప్పండి. రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదనే అల్లు అర్జున్ ను ముఖ్యమంత్రి టార్గెట్ చేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి మీ సమాధానమేంటి..?
రామ్మోహన్ రెడ్డి: నటుడు అల్లు అర్జున్ పేరు చెప్పలేకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోరు. ఇక్కడ సందర్భం వేరు. బాలుడు సీరియస్ కండీషన్ లో ఉన్నారు. అందుకే మానవతా ధృక్పథంతో మా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రూ.25 లక్షల ఆర్ధిక సహాయం బాలుడికి ప్రకటించారు. పేద వర్గాలను ఆధరించాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డిగారు మాట్లడుతున్నారు. అంతేగానీ అల్లు అర్జున్ మా టార్గెట్ కాదు.
ABP దేశం.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నామనే సాకుతోొ మీ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో చేతులెత్తేసినట్లేనా...?
రామ్మోహన్ రెడ్డి: కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు. రేవంత్ రెడ్డి కూడా అంతే . ఏసిబి ,ఈడీ చర్యలు తీసుకుంటాయనే భయంతో కేటీఆర్ మా ప్రభుత్వంపై లేనిపోని అబాండాలు వేస్తున్నాడు.నియోజకవర్గాల వారీగా రైతులకు ఎన్ని కొట్లు రుణమాఫీ జరిగితో బహిరంగ లేఖ విడుదల చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ జరగలేదని నిరూపించకపోతే కేటీఆర్ రాజీనామా చేయాలి.
Also Read: Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్