Jatadhara Movie : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
Sudheer Babu : తనకు కృష్ణా నగర్ కష్టాలు తెలియకపోయినా ఫిల్మ్ నగర్ కష్టాలు తెలుసని హీరో సుధీర్ బాబు తెలిపారు. 'జటాధర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కెరీర్, సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

Sudheer Babu Speech In Jatadhara Pre Release Event : ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు మరో సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'జటాధర'తో రాబోతున్నారు. శనివారం జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన తన కెరీర్, సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. ఇన్నేళ్లలో తాను ఎప్పుడూ సూపర్ స్టార్ మహేష్ బాబు హెల్ప్ అడగలేదని అన్నారు.
ఎన్నో ఆడిషన్స్
తనను ఓ పాత్ర కోసం రిఫర్ చేయమని తాను ఎప్పుడూ ఎవరినీ అడగలేదని సుధీర్ బాబు తెలిపారు. తాను కృష్ణకు అల్లుడు, మహేష్‌కు బావగా ఉండడం గర్వకారణమని... అయితే, నా 20 సినిమాల్లో సక్సెస్, ఫెయిల్యూర్ వెనుక ఉన్న ఒకే ఒక్క రీజన్ తానేనని చెప్పారు. 'సినిమాలకు రికమెండ్ చేయాలని నేను ఎప్పుడూ నా బావ మహేష్ బాబును అడగలేదు. అందరిలాగే నేనూ ఆడిషన్ ఇచ్చాను. కృష్ణకు అల్లుడు, మహేష్‌కు బావగా ఉండడం ఓ గర్వకారణం. ఓ బాధ్యత.
ఒకానొక టైంలో నటుడు కావాలన్న కోరికను అణచివేయాలనుకున్నా. కానీ ఆగిపోకుండా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టా. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఆడిషన్ ఇచ్చాను. ముందు నాతో మాట్లాడిన వాళ్లు కాఫీ ఇచ్చి తర్వాత నో చెప్పేవారు. నాకు కృష్ణా నగర్ కష్టాలు తెలియకపోవచ్చు. కానీ ఫిల్మ్ నగర్‌లో బాధలు తెలుసు. బస్సులో ప్రయాణిస్తూ ఛాన్సెస్ కోసం తిరగడం తెలియకపోవచ్చు. కానీ కారులో కూర్చుని బాధపడడం తెలుసు. ఇది నేను సింపతీ కోసం చెప్పడం లేదు. అలా అనుకుంటే ఫస్ట్ సినిమా అప్పుడే చెప్పేవాడిని.' అని అన్నారు.
Also Read : అలా మొదలైంది... మా తొలి పరిచయం - అల్లు శిరీష్ నయనికల లవ్ స్టోరీ వెనుక నితిన్ వైఫ్
20 మూవీస్... బాధ్యత నాదే...
ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు అనుకున్న తాను... ఇప్పటివరకూ 20 సినిమాలు చేశానని చెప్పారు సుధీర్ బాబు. హిట్స్‌కు కానీ, ప్లాప్స్‌కు కానీ పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. 'నన్ను అభిమానించే ఒక్కరి కోసమైనా కష్టపడి పని చేస్తా. ఫస్ట్ మూవీలో నా వాయిస్ బాగా లేదన్నారు. దీంతో రోజూ గంటల తరబడి వాయిస్ కల్చర్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఆ తర్వాత 'చొక్కా విప్పుతాడు, బాడీ చూపిస్తాడు' అనే కామెంట్స్ వచ్చాయి.
దాన్ని దృష్టిలో పెట్టుకుని 'సమ్మోహనం' తీస్తే... సాఫ్ట్ సినిమాలకు సెట్ అవుతాడన్న కామెంట్స్ వినిపించాయి. ఆ తర్వాత 'శ్రీదేవి సోడా సెంటర్' వంచి మాస్ మూవీ చేశా. బాలీవుడ్‌కు వెళ్లాను. విలన్ రోల్ చేశాను. మన నిర్మాతలైనా కాఫీ ఇచ్చారు. బాలీవుడ్‌కు వెళ్తే అది కూడా దొరకదనుకున్నా. కానీ, చాలా బాగా చూసుకున్నారు. అది హ్యాపీగా ఉంది.' అని చెప్పారు.
ఎవరినీ హెల్ప్ అడగలేదు
చాలాసార్లు ఇండస్ట్రీలో నెపోటిజం అనే మాటలు వినిపించాయని... మహేష్ బాబు నాకు బావ అయినా ఆయన్ను ఎప్పుడూ ఓ సినిమాకు రికమెండ్ చేయాలని ఎలాంటి హెల్ప్ అడగలేదని చెప్పారు సుధీర్ బాబు. 'ఏ నిర్మాతను ఒక్క రూపాయి ఎక్కువ అడగలేదు. ఏ దర్శకుడు ఈ ఫైట్ పెట్టండి. ఆ పాట పెట్టండి అని పుష్ చేయలేదు. అవకాశం విలువ నాకు తెలుసు. 20 సినిమాలు దాని సక్సెస్, ఫెయిల్యూర్ వెనుక ఒకే ఒక్కడు. అది కృష్ణ గారి అల్లుడు. మహేష్ బాబు బావ. అది నేనే.' అంటూ పేర్కొన్నారు.
ఇక, సుధీర్ బాబు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ నేచరల్ థ్రిల్లర్ 'జటాధర'. తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.





















