Allu Sirish Nayanika : అలా మొదలైంది... మా తొలి పరిచయం - అల్లు శిరీష్ నయనికల లవ్ స్టోరీ వెనుక నితిన్ వైఫ్
Allu Sirish Nayanika Love Story : అలా మొదలైంది మా పరిచయం... అంటూ అల్లు శిరీష్ తన లవ్ స్టోరీని తాజాగా ఇన్ స్టాలో రాసుకొచ్చారు. తాము ఇద్దరూ ఎప్పుడు ఫస్ట్ టైం కలిశారో చెప్పారు.

Allu Sirish About His Love Story : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ నయనికతో జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే వీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తాజాగా... ఇన్ స్టా వేదికగా శిరీష్ తన లవ్ స్టోరీని చెప్పారు. నయనికతో తన ఫస్ట్ పరిచయం ఎక్కడ ఎలా జరిగిందో వివరించారు. 'అలా మొదలైంది... మా పరిచయం' అంటూ బెస్ట్ మెమొరీస్ షేర్ చేసుకున్నారు.
అక్కడే ఆమెను చూశా...
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు రెండో వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు చెబుతూ తన లవ్ స్టోరీని చెప్పారు అల్లు శిరీష్. '2023 అక్టోబరులో వరుణ్, లావణ్య వివాహం చేసుకున్నప్పుడు... యంగ్ హీరో నితిన్, షాలిని వారి కోసం పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి షాలిని తన ప్రాణ స్నేహితురాలు నయనికను ఆహ్వానించింది. ఆ వేడుకలో నేను, నయనిక ఫస్ట్ టైం కలిశాం. ఇప్పుడు రెండేళ్ల తర్వాత మేము సంతోషంగా ప్రేమలో ఉన్నాం. నిశ్చితార్థం చేసుకున్నాం.
ఏదో ఒక రోజు, ఇదంతా ఎలా ప్రారంభమైందో నా పిల్లలు నన్ను అడిగినప్పుడు, నేను వారికి అది 'హౌ ఐ మెట్ యువర్ మదర్' అని చెబుతాను. నన్ను వారి సర్కిల్‌లోకి ఆహ్వానించిన, మొదటి రోజు నుంచి నన్ను ప్రేమిస్తున్నట్లు భావించిన నయనిక స్నేహితులందరికీ ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
Also Read : SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
అల్లు శిరీష్, నయనికల ఎంగేజ్మెంట్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దల, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో శిరీష్, నయనికలు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. తాజాగా తన లవ్ స్టోరీని చెప్తూ శిరీష్ పోస్ట్ చేయగా... క్యూట్ లవ్ స్టోరీ అంటూ నెటిజన్లు విషెష్ చెబుతున్నారు.





















