Mass Jathara Day 1 Collection : 'మాస్ జాతర' ఫస్ట్ డే కలెక్షన్స్ - 'మిస్టర్ బచ్చన్'తో కంపేర్ చేస్తే ఎంతో తెలుసా?
Mass Jathara First Day Collection : మాస్ మహారాజ 'మాస్ జాతర' ఫస్ట్ డే కలెక్షన్స్‌పై హైప్ క్రియేట్ అవుతోంది. మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో రవితేజ లాస్ట్ మూవీ కంటే తక్కువ వచ్చినట్లు తెలుస్తోంది.

Ravi Teja's Mass Jathara Worldwide Box Office First Day Collection : మాస్ మహారాజ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' శుక్రవారం ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్లతోనే బాక్సాఫీస్ వద్ద మాస్ బ్లస్టర్ స్టార్ట్ అయ్యిందంటూ మూవీ టీం స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్‌పై అందరి దృష్టి ఉంది.
ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
రవితేజ లాస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'తో పోలిస్తే తొలి రోజు కలెక్షన్స్ అంత ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. ఫస్ట్ డే ఇండియావ్యాప్తంగా రూ.3.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ వెల్లడించింది. ఇక ప్రీమియర్లతో దాదాపు రూ.2.9 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. మొత్తానికి తొలి రోజు రూ.6.65 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలిపింది. ఇక శనివారం 27.71 శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీ ఉన్నట్లు చెప్పింది. వరల్డ్ వైడ్‌గా చూస్తే రూ.3 కోట్లు గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.
ప్రీమియర్స్ @ రూ.5 కోట్లు
అయితే, వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్ల ద్వారా రూ.5 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. కానీ, టికెట్ ధరలు పెంచకుండానే ఇంత కలెక్షన్స్ వచ్చాయా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని రవితేజ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read : SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
ఈ మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహించగా ఆయనకు ఇది డెబ్యూ మూవీ. రవితేజ, శ్రీలీలతో పాటు నవీన్ చంద్ర, వీటీవీ గణేష్, రాజేంద్ర ప్రసాద్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
అల్లూరి జిల్లాలోని గిరిజన అడవివరం చుట్టపక్కల గ్రామాలను శివుడు (నవీన్ చంద్ర) శాసిస్తుంటాడు. రైతులతో అరుదైన శీలావతి రకం గంజాయి పండించి దాన్ని కోల్‌కతాకు స్మగ్లింగ్ చేస్తుంటాడు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్స్ వరకూ అందరినీ తన చేతుల్లో ఉంచుకుని ఈ దందా సాగిస్తుంటాడు. రైల్వేలో నిజాయితీ గల లక్ష్మణ్ భేరి (రవితేజ)... వరంగల్‌లో పని చేసే టైంలో తప్పు చేసిన మినిస్టర్ కొడుకుపై చేయి చేసుకోవడంతో అడవివరం ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శివుడి దందాను లక్ష్మణ్ ఎలా అడ్డుకున్నాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















