Ranveer Singh Video: తల్లి అంజు భవాని బర్త్‌డే వేడుకలో దీపికాతో రణవీర్ సింగ్ హంగామా

తల్లి అంజు భవానీ పుట్టినరోజు వేడుకల్లో భార్య దీపిక పదుకొనేతో కలసి బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఓ రేంజ్ లో హంగామా చేశాడు. ఇప్పుడా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

FOLLOW US: 

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తల్లి అంజు భవాని పుట్టిన రోజు వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో రణవీర్ సింగ్ దీపిక కోసం చేసిన డాన్స్ అదుర్స్ అనిపించింది. తన ‘బేఫిక్రే’ సినిమాలోని హిట్ సాంగ్ 'నాషే సి చధ్ గయి'  పాటకు డాన్స్ చేస్తూ అందరినీ నవ్వించాడు. రణవీర్ ఎక్కడ ఉన్నా సందడిగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎప్పుడూ వెరైటీ దుస్తుల్లో ఆకట్టుకొనే రణవీర్ తల్లి బర్త్‌డేకు కూడా భిన్నంగా తయారయ్యాడు. స్లీవ్‌లెస్ వెస్ట్, రిప్పిడ్ జీన్స్ ధరించి కొత్తగా కనిపించాడు. కౌబోయ్ క్యాప్ పెట్టుకుని హడావిడి చేశాడు. 

మరో  వీడియోలో, రణ్‌వీర్ పద్మావత్  నుంచి  '‘ఖలీబలి'’, కార్తీక్ ఆర్యన్ ‘సోను కే టిటు కి స్వీటీ’ నుంచి '‘దిల్ చోరీ'’ పాటలకు డాన్స్ చేశాడు.  'దిల్ చోరి' సాంగ్ డాన్సులో రణవీర్ సింగ్‌తో పాటూ తల్లి అంజు భవానీ కూడా సందడి చేశారు. రణవీర్ తల్లి పుట్టినరోజు వేడుక ముంబైలోని ఒక రెస్టారెంట్‌లో జరిగినట్లు సమాచారం. దీపిక తల్లిదండ్రులు ప్రకాష్ ,ఉజ్జల పదుకొనె కూడా హాజరయ్యారు. 2018లో దీపిక-రణ్‌వీర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఇద్దరు సినిమాల్లో బిజీగానే ఉన్నారు.  

ఇక రణవీర్ సింగ్ సినిమాల విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్‌తో 'రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ' అనే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పదేళ్ళ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టిన స్టార్ మేకర్ కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ శుక్రవారం ఆగస్టు 21న చిత్ర షూటింగ్ మొదలైంది.  ఈ సందర్భంగా కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ.. "మళ్లీ నా పాత ప్రయాణం కొత్తగా మొదలైంది. ఓ మంచి ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. తప్పకుండా ఈ చిత్రం భావోద్వేగాలు నిండిన ప్రేమ కథే"..అని చెప్పారు. కాగా ఇందులో ధర్మేంద్ర, జయా బచ్చన్‌, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: ఫ్యామిలీ హీరో ఇంత భయంకరంగా మారాడా... ప్రభాస్ సలార్ మూవీలో జగ్గుభాయ్ లుక్ చూశారా..!

Also Read: ఇచ్చట వాహనాలు నిలుపరాదు ట్రైలర్.. ఏరియాకు కొత్తయితే కొట్టేస్తారా?

Also read: చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకున్న RX100 హీరో కార్తికేయ, ఫొటోలు వైరల్

Also Read: చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అల్లు అర్జున్ ఎక్కడా? బన్నీయే మెగాస్టార్ అంటూ చిరు ఫ్యామిలీలో ఆర్జీవి చిచ్చు

Published at : 24 Aug 2021 02:31 PM (IST) Tags: Ranveer singh dance video teasing deepika padukone anju bavnanis birthday

సంబంధిత కథనాలు

Devatha జులై 5 ఎపిసోడ్: దేవుడమ్మకి రుక్మిణి  వాయనం, రుక్మిణి  ఫోన్ ట్యాప్  చేసిన మాధవ

Devatha జులై 5 ఎపిసోడ్: దేవుడమ్మకి రుక్మిణి వాయనం, రుక్మిణి ఫోన్ ట్యాప్ చేసిన మాధవ

Janaki Kalaganaledu జులై 5 ఎపిసోడ్: గోవిందరాజుల పరిస్థితి విషమం, ఆందోళనలో జ్ఞానంబ- జానకిని ఇరికించిన మల్లిక

Janaki Kalaganaledu జులై 5 ఎపిసోడ్: గోవిందరాజుల పరిస్థితి విషమం, ఆందోళనలో జ్ఞానంబ- జానకిని ఇరికించిన మల్లిక

Narayana Murthy: పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృవియోగం

Narayana Murthy: పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తికి మాతృవియోగం

Gudipoodi Srihari Is No More: సినీ విశ్లేషకులు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

Gudipoodi Srihari Is No More: సినీ విశ్లేషకులు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

టాప్ స్టోరీస్

President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి

Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి

Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు

Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు