అన్వేషించండి

Chiranjeevi Birthday: చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అల్లు అర్జున్ ఎక్కడా? బన్నీయే మెగాస్టార్ అంటూ చిరు ఫ్యామిలీలో ఆర్జీవి చిచ్చు

ఓ వైపు రాఖీ, మరోవైపు మెగాస్టార్ బర్త్ డే...ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో మునిగితేలింది. వేడుకల్లో ఎక్కడా బన్నీ ఫ్యామిలీ కనిపించకపోవడం హాట్ టాపిక్ అయింది. ఈ విషయంపై ఆర్జీవీ ట్వీట్స్ దుమారం రేపుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఓ రేంజ్ లో జరిగాయి. రాఖీ పండగ - చిరు బర్త్ డే రెండూ ఒకేసారి రావడంతో మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి.  మెగా ఫ్యామిలీ సభ్యులంతా చిరంజీవి ఇంట్లో చేరి పెద్ద పండుగే చేసుకున్నారు. మెగా బ్రదర్స్ కు రాఖీ కట్టిన ఆడపడుచులు వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలానే బిగ్ బాస్ తో కేక్ కట్ చేయించి బర్త్ డే ని సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముగ్గురు మొనగాళ్లతో పాటూ మెగా ఫ్యామిలీ హీరోలందర్నీ ఒకే దగ్గర చూసి అభిమానులు ఆనందానికి హద్దే లేదు. అయితే ఈ వేడుకల్లో ఎక్కడా అల్లు అర్జున్ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. 

చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో... పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్ - ఉపాసన, సుస్మిత, శ్రీజ, విష్ణు, కళ్యాణ్ దేవ్, చెల్లెల్లు, మనవరాళ్లు, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక దంపతులు, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ సహా చిరు బావమరిది అల్లు అరవింద్ కూడా సతీసమేతంగా హాజరయ్యాడు. కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకల్లో ఎక్కడా బన్నీ ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్.. వేడుకలకు ఎందుకు డుమ్మా కొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీ అని కాకుండా.. అల్లు ఫ్యామిలీ అనుకునేలా బన్నీ వ్యవహరిస్తున్నాడనే చర్చలు జరిగాయి. 

Also Read: దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్
Chiranjeevi Birthday: చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అల్లు అర్జున్ ఎక్కడా? బన్నీయే మెగాస్టార్ అంటూ చిరు ఫ్యామిలీలో ఆర్జీవి చిచ్చు

Also read: క్లాస్, మాస్... పాటేదైనా మాధుర్యాన్ని పంచే సింగర్ 'గీతామాధురి'కి జన్మదిన శుభాకాంక్షలు

అల్లు అర్జున్ 'పుష్ప' షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లనే మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు వెళ్లలేదంటున్నారు అభిమానులు. ఆదివారం ఉదయాన్నే చిరుకు స్వయంగా విషెస్ అందించి షూటింగ్‌కి వెళ్లాడని చెబుతున్నారు.  కనీసం భార్య స్నేహారెడ్డి అయినా ఈ వేడుకల్లో కనిపించాలి కదా అని మరో ప్రశ్న లేవనెత్తారు నెటిజన్లు. మరోవైపు ఏ చిన్న అవకాశం దొరికినా వాడేసుకోవాలని చూసే రామ్ గోపాల్ వర్మ.. మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. ఒరిజనల్ మెగస్టార్ చిరంజీవి తర్వాత.. అల్లు అర్జున్ ఒక్కడే రియల్ మెగాస్టార్ అని పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ సహా ఇతర మెగా హీరోలందరూ పరాన్నజీవులు అన్నట్లుగా ట్వీట్లు చేశాడు.  Chiranjeevi Birthday: చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అల్లు అర్జున్ ఎక్కడా? బన్నీయే మెగాస్టార్ అంటూ చిరు ఫ్యామిలీలో ఆర్జీవి చిచ్చు

‘‘చిరంజీవి కుమారులు మేనల్లుళ్లు, మేనకోడళ్లు, మేనమామలు బంధువుల కంటే.. హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడైన అల్లు అర్జున్ మాత్రమే నిజమైన సక్సెస్’’ అని ఆర్జీవి మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.  చిరంజీవి వేడుకలకు హాజరు కాకపోవడం అల్లు అర్జున్ తెలివైన నిర్ణయమని, అతను సెల్ఫ్ మేడ్ స్టార్ అని తెలిపాడు. ‘‘చిరంజీవి విజయాన్ని అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ మొదలైన కుటుంబ పరాన్నజీవులలో అల్లు అర్జున్ చేరకూడదు'' అని వర్మ మరో వివాదాస్పద ట్వీట్స్ చేశాడు. ఆర్జీవీ వరుస ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీ వేర్వేరు అన్నట్లుగా వర్మ చేసిన ట్వీట్లపై మెగా అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.Chiranjeevi Birthday: చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అల్లు అర్జున్ ఎక్కడా? బన్నీయే మెగాస్టార్ అంటూ చిరు ఫ్యామిలీలో ఆర్జీవి చిచ్చు

Also Read: ఫ్యామిలీ హీరో ఇంత భయంకరంగా మారాడా... ప్రభాస్ సలార్ మూవీలో జగ్గుభాయ్ లుక్ చూశారా..!

Also Read: ఇచ్చట వాహనాలు నిలుపరాదు ట్రైలర్.. ఏరియాకు కొత్తయితే కొట్టేస్తారా?

Also read: చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకున్న RX100 హీరో కార్తికేయ, ఫొటోలు వైరల్

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 27th:పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
జగద్ధాత్రి సీరియల్: పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Mahendragiri Varahi : మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
Pyaar Prema Kalyanam OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget