అన్వేషించండి

Rowdy Boys First Look: దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి ‘రౌడీ బాయ్స్’ మోషన్ పోస్టర్

ఇప్పటి వరకు చాలా మంది హీరోలకు గుర్తుండిపోయే విజయాలు అందించిన నిర్మాత..ఇప్పుడు తన ఇంటి నుంచి వారసుడిని తీసుకొస్తున్నాడు. తన తమ్ముడి కొడుకును హీరోగా లాంఛ్ చేస్తున్నాడు. ఆ సంగతులు ఇప్పుడు చూద్దాం

తెలుగు ఇండ‌స్ట్రీలో వారసుల హవాసాగుతోంది.  మెగా కుటుంబం నుంచి దాదాపు క్రికెట్ టీం బరిలో ఉంది. మిగిలిన కుటుంబాల నుంచి కూడా వారసులు ఇండస్ట్రీలో సత్తాచాటుకుంటున్నారు. ఇప్పుడు మరో వార‌సుడు కూడా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. దిల్ రాజు సోదరుడైన శిరీష్ తనయుడు ఆశీష్‌ రెడ్డిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు ఈ నిర్మాత‌.  ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్ ఖరారు చేశారు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా ప్రమోషన్ ని ఆ మధ్య ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ వేడుకలో చేశారు. అయితే కరోనా కారణంగా సినిమా మళ్లీ వాయిదా పడింది. చిన్న సినిమానే అయినా  దిల్ రాజు మార్క్ ప్రమోషన్ సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకులు వీవీ వినాయక్ ఫస్ట్ లుక్, సుకుమార్‌ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

Read Also: ఆగస్టు ఆఖరివారంలో థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే

‘‘హీరోగా చాలామంది వస్తారు. కానీ సక్సెస్‌ కావడం కష్టం. ఇది ఆశిష్‌కు బిగ్‌ టార్గెట్‌. ఎంత జడ్జ్‌మెంట్‌ ఉన్నప్పటికీ ప్రేక్షకులు పాస్‌ మార్కులు వేసేంతవరకు టెన్షన్‌ పడతాం. ఆశిష్‌ను లాంచ్‌ చేస్తున్నాం కాబట్టి ఈ సినిమాకు కాస్త ఎక్కువ టెన్షన్‌ పడుతున్నాం’’ అన్నారు నిర్మాత  దిల్ రాజు.  ‘‘హీరోగా సక్సెస్‌ కాకపోతే మరో ఆప్షన్‌ పెట్టుకోవాలని ఆశిష్‌ను ప్రిపేర్‌ చేస్తూనే ఉన్నాను. కానీ ఆశిష్‌ డ్యాన్స్, ఎనర్జీ లెవల్స్‌ బాగుంటాయి. సక్సెస్‌ అవుతాడనే నమ్మకం ఉంది.  ఆశిష్‌తోపాటు లగడపాటి శ్రీధర్‌ తనయుడు విక్రమ్‌ ఇందులో నటించాడు. వాళ్లిద్దరూ అనుపమతో పోటీపడి నటించారు’’ అని తెలిపారు. 

Also Read: ఫ్యామిలీ హీరో ఇంత భయంకరంగా మారాడా... ప్రభాస్ సలార్ మూవీలో జగ్గుభాయ్ లుక్ చూశారా..!

ఒకవేళ ఫెయిల్‌ అయితే ఆశిష్‌ దేనికైనా ప్రిపేర్డ్‌గా ఉండాలని దిల్‌ రాజు చెబుతున్నాడు కానీ ఆశిష్‌కు ఏ ఆప్షన్స్‌ అవసరం లేదని.. కొన్ని సీన్స్ చూశా బాగా చేశాడనిపించిందన్నారు వినాయక్. రొమాంటిక్ సీన్స్ అదుర్స్ అన్నాడు మరో దర్శకుడు సుకుమార్. తనని హీరోగా చూడాలనుకున్న అనిత ( దిల్ రాజు మొదటి భార్య) ఇప్పుడు లేరని.. తనని హీరోగా గుర్తించిన ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్నాడు ఆశిష్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు లక్ష్మణ్, లగడపాటి శ్రీధర్, శిరీష్, హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ పాల్గొన్నారు. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన ‘రౌడీ బాయ్స్‌’అక్టోబరులో విడుదల కానుంది. 

Also Read: ఇచ్చట వాహనాలు నిలుపరాదు ట్రైలర్.. ఏరియాకు కొత్తయితే కొట్టేస్తారా?

Also read: చడీచప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకున్న RX100 హీరో కార్తికేయ, ఫొటోలు వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget