Salaar Interview: ‘కేజీయఫ్’ కనెక్షన్, ‘బాహుబలి 3’ అప్‌డేట్ - ‘సలార్’ టీమ్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ ప్రోమో!
SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘సలార్’ టీమ్‌తో చేసిన ఇంటర్వ్యూను విడుదల చేశారు.
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సలార్’. డిసెంబర్ 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అంటే ఇంకా వారం రోజులు కూడా లేదన్న మాట. దీంతో ప్రమోషన్‌లో టీమ్ జోరు పెంచింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్, సినిమాలో విలన్‌గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్‌లను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో ఫన్నీగా సాగుతూనే సినిమా మేకింగ్ గురించిన వివరాలను కూడా రివీల్ చేసింది.
దేశంలోని అన్ని ప్రాంతాల వారికి రీచ్ అయ్యేందుకు అనుగుణంగా ఈ ఇంటర్వ్యూను ఇంగ్లిష్‌లో చేశారు. ‘ఈ సినిమాలో ఎక్కువ డ్రామా ఉందట నిజమేనా?’ అని రాజమౌళి అడిగినప్పుడు ‘ప్రశాంత్ నీల్‌తో షూట్ చేసేటప్పుడు ఫైనల్ డ్రాఫ్ట్ (స్క్రిప్ట్) అనేది ఏదీ ఉండదు.’ అని ఆయన జవాబిచ్చారు. ‘కేజీయఫ్, సలార్‌ల మధ్య కనెక్షన్ ఉందా?’ అని ప్రశాంత్ నీల్‌ను అడిగినప్పుడు ఆయన ఏం అడిగారో చూపించలేదు కానీ రాజమౌళి బదులుగా ‘నన్ను బాగా డిజప్పాయింట్ చేశావు.’ అన్నారు. దానికి ప్రశాంత్ నీల్ ‘అయాం సారీ ఫర్ దట్’ అని రిప్లై ఇచ్చారు.
రాజమౌళి అడిగిన ఏదో ప్రశ్నకు సంబంధించి ప్రభాస్... ప్రశాంత్ నీల్ వైపు తిరిగి ‘ఆయనకు డైరెక్షన్ నేర్పింది నేనే. కాబట్టి పర్లేదు.’ అని ఫన్నీగా చెప్పారు. ‘బాహుబలి 3’ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ‘ఇది ఇద్దరు స్నేహితులకు సంబంధించిన కథ.’ అన్నారు. ప్రభాస్ కూడా ‘ఖాన్‌సార్ అనేది ఒక వయొలెంట్ సిటీ.’ అని చెప్పడంతో ప్రోమో ఎండ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూను డిసెంబర్ 19వ తేదీన విడుదల చేయనున్నారు.
మరోవైపు భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ‘సలార్’ ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. చిత్రబృందం అంచనాలను మరింత పెంచడానికే ట్రై చేస్తుంది. ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ తరహాలో ‘సలార్’ ఉండనుందని చెప్పారు. ఇందులో క్యారెక్టర్ డైనమిక్స్ చాలా అద్భుతంగా ఉండనున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ‘సలార్’ ‘కేజీఎఫ్’ తరహాలో ఉంటుందని అందరూ భావించారు కానీ ఈ సినిమా అంతకు మించి ఉంటుందని తెలిపారు. ‘సలార్’లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అలాగే ‘సలార్’ సమయంలో ప్రభాస్‌తో మంచి అనుబంధం ఏర్పడిందని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. ఆయనతో పాటు ఉండే వాళ్లను ఎంతో ప్రేమగా చూసుకుంటారని పేర్కొన్నారు. ‘ఈ చిత్రంలో నేను వరదరాజ మన్నార్‌గా నటించాను. సలార్‌లో ప్రభాస్ దేవాగా కనిపిస్తారు. ఇందులో నటించడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. నా కెరీర్‌లోనే ఇలాంటి కథను చూడలేదు. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంటుందని నాకు గట్టి నమ్మకం ఉంది. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువ. నేను తరచుగా ప్రభాస్‌తో మాట్లాడతాను. సినిమా సెట్‌లో ప్రభాస్‌ను అందరూ ఇష్టపడతారు. అందరికీ చక్కటి భోజనం ప్రభాస్ ఇంటి నుంచే తెప్పిస్తారు. తన చుట్టూ ఉండే వాళ్లను ప్రభాస్ హ్యాపీగా చూసుకుంటారు. అందుకే ఆయనను అందరూ డార్లింగ్ అని పిలుస్తారని నాకు అర్థం అయ్యింది” అని వెల్లడించారు.