Salaar: 'కెజియఫ్'లో చేసిన తప్పే మళ్ళీ 'సలార్'కు - దర్శకుడికి ఆమాత్రం టైమ్ లేదా?
Prashanth Neel on Salaar movie mistakes: 'సలార్' విడుదలకు కొన్ని గంటల ముందు ప్రశాంత్ నీల్ ఓ విషయం బయట పెట్టారు. 'కెజియఫ్' విషయంలో జరిగిన తప్పులు మళ్ళీ జరిగాయని చెప్పారు.
Prashanth Neel interview Salaar: 'సలార్' విడుదలకు ముందు వచ్చిన యాక్షన్ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు కావాల్సిన కిక్ ఇచ్చింది. భారీ యాక్షన్ ఫిల్మ్ సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నామనే నమ్మకాన్ని కలిగించింది. ప్రభాస్ కటౌట్ ప్లస్ యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. 'కెజియఫ్' తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా కావడం కూడా అంచనాలు పెరగడానికి ఓ కారణం. అయితే... ఈ సినిమాలో విషయంలో ఓ తప్పు జరిగిందని ప్రశాంత్ నీల్ చెబితే?
'కెజియఫ్'కు చేసిన తప్పే... మళ్ళీ!
ప్రశాంత్ నీల్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'సలార్' గురించి మాట్లాడుతూ ''ఈ సినిమాకు కూడా 'కెజియఫ్' విషయంలో చేసిన మిస్టేక్స్ రిపీట్ చేశా. మనం ఫైనల్ ఎడిట్ చూస్తేనే కదా సినిమాను జడ్జ్ చేయగలం!? నాకు ఉన్న సిట్యువేషన్స్ కారణంగా సినిమా చూడటం కుదరలేదు. కానీ, ఒక్కసారి చూసి ఉంటే సినిమా ఎలా ఉంటుందో నాకు అర్థం అయ్యేది. అయినా పర్లేదు. మేం చేసిన దానితో హ్యాపీగా ఉన్నాం'' అని చెప్పారు.
Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!
"Like the Few Mistakes I did in #KGF, I'm revisiting them in Salaar; it's like making the same (KGF) mistakes again in #Salaar. We can judge a film after completing the final edit. I got myself into a messy situation. But We are happy with what we have done, but I probably should… pic.twitter.com/wUFyiWw6zH
— Movies4u Official (@Movies4u_Officl) December 18, 2023
'కెజియఫ్' విడుదలకు ముందు ప్రశాంత్ నీల్ సినిమా చూడలేదట! అయితేనేం? ఆ సినిమాలు వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ స్కిల్స్ & టేకింగ్ చూసి జనాలు జేజేలు కొట్టారు. ఆల్రెడీ విడుదలైన 'సలార్' యాక్షన్ ట్రైలర్ చూసిన తర్వాత అటువంటి యాక్షన్ బ్లాక్స్ నాలుగైదు పడితే సినిమా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అదీ సంగతి!
తెలంగాణ, ఏపీలో బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడు?
Salaar advance booking: ఓవర్సీస్, నార్త్ ఇండియా, తమిళనాడులో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే... తెలంగాణ, ఏపీలో టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇవాళ లేదా రేపు ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆన్ లైన్ కాకుండా ఆఫ్ లైన్ సేల్స్ కూడా చేయాలని డిసైడ్ అవుతున్నట్లు మరో టాక్.
Also Read: పిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
Salaar cast and crew names : 'సలార్'లో ప్రభాస్ జోడీగా స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ నటించారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రలో ఆమె కనిపించనున్నారు. ట్రైలర్ చూస్తే... ఓ షాట్ లో ఆమె కూడా ఉన్నారు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది.
'సలార్' సినిమాలో ఇతర నటీనటుల విషయానికి వస్తే... ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటించారు. 'కెజియఫ్'లో కూడా ఆమె ఉన్నారు. అయితే... అందులో ఆమెది ముస్లిం పాత్ర. ఇందులో హిందూ పాత్ర! ఇక, కథలో కీలకమైన వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫీ బాధ్యతలు నిర్వర్తించారు.