RRR: 'ఆర్ఆర్ఆర్'లో మల్లి పాత్రలో కనిపించిన చిన్నారి ఎవరో తెలుసా?
'ఆర్ఆర్ఆర్' కథను ముందుకు నడిపించే కీలకపాత్రలో మల్లి నటన మెప్పిస్తుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరు..?
దర్శకుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ.. భారీ వసూళ్లను సాధిస్తోంది ఈ సినిమా. ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. వీరిద్దరితో పాటు సినిమాలో చాలా పాత్రలకు మంచి ఆదరణ లభిస్తోంది. వాటిలో మల్లి రోల్ ఒకటి.
గిరిజన జాతికి చెందిన మల్లి అనే చిన్నారిని బ్రిటిష్ దొరసాని తనవెంట తీసుకెళ్లే దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది. కథను ముందుకు నడిపించే కీలకపాత్రలో మల్లి నటన మెప్పిస్తుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. మల్లి పాత్ర పోషించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ట్వింకిల్ శర్మ. ఆమెది చంఢీగర్. డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత కొన్ని టీవీ యాడ్స్ లో కనిపించింది. ఫ్లిప్ కార్ట్ యాడ్ లో ఈమెని చూసిన రాజమౌళి ఆడిషన్ కి పిలిపించి.. మల్లి పాత్రకు ఎంపిక చేసుకున్నారు. ట్వింకిల్‌కి తమిళ భాషలో స్క్రిప్ట్‌ను అందించి, ఆ భాషలో ఆడిషన్‌కు రమ్మని అడిగారట. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ సహాయంతో తమిళ భాషలోనే ఆడిషన్ చేసింది ట్వింకిల్.. ఆమె నటన రాజమౌళికి నచ్చడంతో వెంటనే మల్లి రోల్ కి ఫైనల్ చేశారు. ఈ ఒక్క పాత్ర కోసం ఏకంగా 160 మందిని ఆడిషన్ చేశాడట జక్కన్న.
మొత్తానికి ట్వింకిల్ ఆ రోల్ కొట్టేసింది. సినిమాలో మల్లి రోల్ కనిపించేది కొన్ని సార్లే అయినప్పటికీ.. ఉన్నంతలో తన నటనతో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. 'నన్ను ఈడ ఇడిసిపోకన్నా..' అంటూ ఎన్టీఆర్ ని ఆమె ప్లీజ్ చేసే డైలాగ్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్న ఈ చిన్నారికి మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.
మరోపక్క 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.500 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఓవర్సీస్ లో ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో రికార్డులు సృష్టిస్తోంది. అమెరికాలో ఫస్ట్ వీకెండ్ 9.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.
Also Read: మూడు రోజుల్లో రూ. 500 కోట్లు, వసూళ్ల వేటలో 'ఆర్ఆర్ఆర్' సరికొత్త చరిత్ర
Also Read: ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్, యాక్సిడెంట్ తర్వాత తొలిసారి సెట్స్‌కు