News
News
X

Romantic Movie: యన్.టి.ఆర్ ఆర్ట్స్‌లో... అతడి రెండో సినిమా!

అతడు నందమూరి కల్యాణ్ రామ్ ప్రొడక్షన్ హౌస్ 'యన్.టి.ఆర్ ఆర్ట్స్' ద్వారా దర్శకుడిగా పరిచయం కావాల్సింది. కానీ, ఎందుకు ఆ సినిమా చేయలేదు? ఇప్పుడు నెక్స్ట్ సినిమా గురించి ఏమంటున్నాడు? తెలుసుకోండి. 

FOLLOW US: 

'రొమాంటిక్' సినిమాతో అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనకు వి.ఎఫ్‌.ఎక్స్‌ రంగంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. వి.ఎఫ్‌.ఎక్స్‌ నుండి దర్శకత్వం వైపు ఆయన అడుగులు వేయడానికి కారణం పూరి జగన్నాథ్. "ఇజం' సినిమా సమయంలో వేరే కథను డైరెక్ట్ చేయమని పూరి గారు నన్ను అడిగారు. కానీ, నా మీద నాకు నమ్మకం లేక వద్దని చెప్పాను. కానీ, పూరి గారికి నేను రాసేవి నచ్చేవి. నా మీద నమ్మకం ఉండేది. అందుకని, ఈ సినిమా ఇచ్చారు. నాలో దర్శకుడు కావాలనే ఆలోచన మొదలు కావడానికి కారణం పూరిగారే" అని అనిల్ పాదూరి చెప్పారు.

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయడంతో పాటు తన కుమారుడిని అనిల్ పాదూరి చేతిలో పెట్టి 'రొమాంటిక్' ప్రొడ్యూస్ చేశారు పూరి. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్స్ చూస్తే పూరి జగన్నాథ్ మార్క్ స్పష్టంగా కనిపించింది. ఈ నెల 29న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో అనిల్ పాదూరి మాట్లాడుతూ "కథ, మాటలు పూరిగారివి అయినా నా మార్క్ కూడా ఉంటుంది. సినిమాపై ఆయన ప్రభావం ఉంది. కానీ, సినిమా చూస్తే పూరిగారు తీసిన సినిమాల ఉండదు. వేరేవాళ్లు తీసినట్టు ఉంటుంది. సినిమా చూశాక పూరిగారు నా సినిమాలో ఎంత ఎమోషన్ ఎక్కడుందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్రైలర్లు, పాటలు చూసి యూత్ సినిమా అనుకోవద్దు. ఇందులో కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది" అని చెప్పారు.

Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!

పూరి జగన్నాథ్, అనిల్ పాదూరి మధ్య 'టెంపర్' సినిమా సమయంలో పరిచయం ఏర్పడింది. ఎన్టీఆర్ హీరోగా పూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాకు అనిల్ పాదూరి వి.ఎఫ్.ఎక్స్ చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్, అనిల్ కలిసి ఓ వి.ఎఫ్.ఎక్స్ కంపెనీ ప్రారంభించారు. కల్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ 'యన్.టి.ఆర్ ఆర్ట్స్'లో దర్శకుడిగా పరిచయం కావాలని అనుకున్నారు. కానీ, వీ.ఎఫ్.ఎక్స్ పనులతో బిజీగా ఉండటంతో కుదరలేదు. తర్వాత 'రొమాంటిక్' వచ్చింది. ఇప్పుడు దర్శకుడిగా తన నెక్స్ట్ సినిమాను తప్పకుండా 'యన్.టి.ఆర్ ఆర్ట్స్'లో చేస్తానని అనిల్ పాదూరి స్పష్టం చేశారు.

Also Read: 'రాధే శ్యామ్' టీజ‌ర్‌లో అంతులేని కథ... మీరు గమనించారా?

Also Read: 'రొమాంటిక్' సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్.. విన్నారా..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Oct 2021 05:00 PM (IST) Tags: ntr Nandamuri Kalyan Ram Puri Jagannadh romantic movie Anil Paduri NTR Arts Banner Next Movie Anil Paduri Next in NTR Arts Romantic Anil Paduri About His Next Akash Puri Romantic Temper Movie

సంబంధిత కథనాలు

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

Janaki Kalaganaledu October 7th: జ్ఞానంబని నిలదీసిన పీటర్, మేరీ- ఆగ్రహించిన జెస్సి, ధైర్యం చెప్పిన జానకి

Guppedantha Manasu October 7th Update: టామ్ అండ్ జెర్రీ రిషిధార మళ్లీ గొడవ మొదలెట్టారు, ఆలోచనలో పడిన మహేంద్ర-జగతి

Guppedantha Manasu October 7th Update: టామ్ అండ్ జెర్రీ రిషిధార మళ్లీ గొడవ మొదలెట్టారు, ఆలోచనలో పడిన మహేంద్ర-జగతి

Karthika Deepam October 7th Update: కార్తీకదీపంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీపని ఫాలో అవుతున్న డాక్టర్ బాబు

Karthika Deepam October 7th Update: కార్తీకదీపంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీపని ఫాలో అవుతున్న డాక్టర్ బాబు

Gruhalakshmi October 7th Update: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు

Gruhalakshmi October 7th Update: తులసి కోసం వచ్చి అనసూయ ముందు అడ్డంగా బుక్కైన సామ్రాట్- తప్పించుకోలేక తిప్పలు

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

భగవంతుని ఆగ్రహానికి గురి కావద్దు- టీటీడీకి విజయ శంకర స్వామి వార్నింగ్

భగవంతుని ఆగ్రహానికి గురి కావద్దు- టీటీడీకి విజయ శంకర స్వామి వార్నింగ్

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?