అన్వేషించండి

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

హిట్లర్’ సినిమాలో రైటర్ గా తనకు అవకాశం వచ్చి తర్వాత మిస్ అవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు రైటర్ మరుధూరి రాజా. ఇంటర్వ్యూలో ఆ సినిమాలో తనకు వచ్చిన అవకాశం ఎలా మిస్ అయిందో చెప్పుకొచ్చారు రాజా.

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. పరిస్థితులను బట్టీ నిర్ణయాలు అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అది కేవలం ఒక్క సినిమాల విషయంలోనే కాదు ఆ సినిమాకు పనిచేసే ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. అలా జరగడానికి కారణాలు ఏమైనా తర్వాత ఆ సినిమా హిట్ అయితే ‘అయ్యో ఆ సినిమా నేను చేసి ఉండాల్సింది’ అని ఫీల్ అవుతూ ఉంటారు. దర్శకుడు, రచయిత మరుధూరి రాజా విషయంలో కూడా అలాంటి సంఘటన జరిగిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చిరంజీవి ‘హిట్లర్’ సినిమాలో రైటర్ గా తనకు అవకాశం వచ్చి తర్వాత మిస్ అవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సినిమా విడుదలై సూపర్ సక్సెస్ అయిందని, అలాంటి మంచి సినిమాలో అవకాశం పోయినందుకు అప్పుడప్పుడు బాధనిపిస్తుందని చెప్పారు. ఆ సినిమాలో తనకు వచ్చిన అవకాశం ఎలా మిస్ అయిందో చెప్పుకొచ్చారు రాజా.

‘హిట్లర్’ మోహన్ బాబుతో చేద్దామనుకున్నాం: మరుధూరి రాజా

మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సినిమా ‘హిట్లర్’ ఆ సినిమా చాలా బాగుంటుందని, అది మనం చేద్దాం అని ఎడిటర్ మోహన్ తనతో చెప్పారని అన్నారు రాజా. ముందు మోహన్ బాబుతో ఈ సినిమా చేద్దామని, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణను సంప్రదించాలని ఎడిటర్ మోహన్ తనకు చెప్పారని తెలిపారు. అదే విషయాన్ని తాను ఈవీవీతో చెప్తే.. ఇప్పటికే మోహన్ బాబుతో రెండు సినిమాలు చేస్తున్నానని, మళ్లీ మూడో సినిమా వద్దులే అని తాను చెయ్యలేనని చెప్పారట ఈవీవీ. దీంతో సర్లే అని వదిలేశామని చెప్పారు. అయితే నాలుగు రోజుల తర్వాత ఎడిటర్ మోహన్ తనకు ఫోన్ చేసి ‘హిట్లర్’ను చిరంజీవి చేస్తున్నారని చెప్తే సంతోషించానని అన్నారు. ఎడిటర్ మోహన్ తనకు మలయాళ హిట్లర్ సినిమా క్యాసెట్ లు పంపారని, ఫస్ట్ ఆఫ్ చూసిన తర్వాత ఎడిటర్ మోహన్ కు ఫోన్ చేసి మనం మంచి సినిమా తీస్తున్నామని చెప్పానన్నారు. తర్వాత సెకండ్ ఆఫ్ కూడా చూసి ఈ సినిమా సూపర్ హిట్ మనకు తిరుగులేదు అని మోహన్ కు ఫోన్ చేసి చెప్పానని అన్నారు. చిరంజీవితో సినిమా అని ఫుల్ గా ప్రిపేర్ అయిపోయానని చెప్పారు.

సినిమా ఓకే అయ్యాక రైటర్ గా నా పేరు కనిపించలేదు, నాపై కుట్ర జరిగింది

చిరంజీవి ‘హిట్లర్’ సినిమాకు తాను రైటర్ గా చేస్తున్నానని సంతోషించేలోపే నిర్ణయాలు మారిపోయాయని అన్నారు. అప్పటి వరకూ తానే రైటర్ అని అందరూ అనుకున్నారని కానీ, డైరెక్టర్ గా ముత్యాల సుబ్బయ్య వచ్చాక రైటర్ ను మార్చేసారని అన్నారు. అప్పటి వరకూ తన పేరు ఉంచి డైరెక్టర్ వచ్చాక పేరు తీసేసారంటే దానికి కారణం ఎవరై ఉంటారు చెప్పక్కర్లేదన్నారు. ఆ సినిమా మిస్ అయినందుకు బాధగా లేదని, కానీ ఆ సినిమాలో కుట్ర జరిగిందని, అందులో భాగంగానే తనను పక్కన పెట్టారని అన్నారు. అలా ఆ సినిమాకు రైటర్ గా చేయాల్సిన ఆయన ఆ అవకాశాన్ని ఎలా మిస్ అయ్యారో చెప్పుకొచ్చారు రాజా.

Read Also: చెర్రీ, తారక్‌లతో కలిసి పనిచేయాలని ఉంది - ‘థోర్’ హీరో క్రిస్ హేమ్స్‌ వెల్లడి, RRRపై ప్రశంసలు

టాప్ హెడ్ లైన్స్

The Paradise OTT: నెట్‌ఫ్లిక్స్‌లో నాని ప్యారడైజ్ స్ట్రీమింగ్ షురూ... ఎన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చిందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన నాని ప్యారడైజ్... ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? ఎన్ని భాషల్లో ఉందంటే?
Meghasandesam Serial Today October 22nd: ‘మేఘసందేశం’ సీరియల్‌: సూర్యకు షాక్‌ ఇచ్చిన ఆకాష్‌ – శరత్‌ చంద్రకు నిజం చెప్పిన చెర్రి    
‘మేఘసందేశం’ సీరియల్‌: సూర్యకు షాక్‌ ఇచ్చిన ఆకాష్‌ – శరత్‌ చంద్రకు నిజం చెప్పిన చెర్రి    
Nindu Noorella Saavasam Serial Today October 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి పాటకు జడుసుకున్న పిల్లలు – షాకైన సరస్వతి వార్డెన్‌  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి పాటకు జడుసుకున్న పిల్లలు – షాకైన సరస్వతి వార్డెన్‌  
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఎలిమినేషన్‌ కోసం 2 జోన్స్‌! డేంజర్‌ జోన్‌లోనే రోహిత్, షాలిని! అదిరిపోయిన టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఎలిమినేషన్‌ కోసం 2 జోన్స్‌! డేంజర్‌ జోన్‌లోనే రోహిత్, షాలిని! అదిరిపోయిన టాస్క్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
Embed widget