Chris Hemsworth: చెర్రీ, తారక్‌లతో కలిసి పనిచేయాలని ఉంది - ‘థోర్’ హీరో క్రిస్ హేమ్స్ వెల్లడి, RRRపై ప్రశంసలు
‘RRR’ చిత్రంపై మరో హాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందన్న ఆయన, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్‘. ఈ చిత్రం భారత్ తో పాటు ఇతర దేశాల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్టులో చేరారు క్రిస్ హేమ్స్ వర్త్. సినిమా అద్భుతం అన్న క్రిస్, చెర్రీ, జూనియర్ తో కలిసి పని చేయాలని ఉందన్నారు.
‘RRR’పై మార్వెల్ స్టార్ క్రిస్ హేమ్స్ వర్త్ ప్రశంసల వర్షం
థోర్ పాత్రతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న మార్వెల్ స్టార్ క్రిస్ హేమ్స్ వర్త్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘RRR’ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇండియా పై ఉన్న ప్రత్యేక అభిమానం గురించి చెప్పుకొచ్చారు. రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హేమ్స్ వర్త్‌కు ఇండియా అంటే చాలా అభిమానం. తన కూతురురికి ఆయన ఇండియా అనే పేరును పెట్టాడు. ఇండియాలో తనకు ఉన్న అభిమానుల గురించి తెలిసి కూతురుకు ఆ పేరును పెట్టాడట. అది వాస్తవమేనని తాజాగా ఆయన వెల్లడించారు. “ఇటీవల నేను ‘RRR’ సినిమా చూశాను. అది ఒక అద్భుతమైన చిత్రం. వండర్ ఫుల్ అనే ఫీలింగ్ కలిగింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ బాగుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన నన్ను ఆకట్టుకుంది. వారితో కలిసి పని చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అంతేకాదు, వారితో కలిసి పని చేసే అవకాశం వస్తే నేను లక్కీగా ఫీలవుతాను” అని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇండియన్ స్టార్స్ గురించి మాట్లాడని హేమ్స్ వర్త్, తొలిసారి ‘RRR’ స్టార్స్ గురించి మాట్లాడ్డం ఆసక్తి కలిగిస్తోంది.
విప్లవ వీరుల స్పూర్తితో తెరకెక్కిన ‘RRR’ చిత్రం
అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లాంటి ఇద్దరు విప్లవ వీరుల స్పూర్తితో అల్లుకున్న కల్పిత కథతో ‘RRR’ చిత్రాన్ని తెరకెక్కించారు రాజమౌళి. భీమ్ గా తారక్, రామరాజుగా చరణ్ నటించారు. అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరీస్, శ్రియా సరన్, సముద్రఖని తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఈ సినిమాలో చంద్రబోస్ రాసిన 'నాటు నాటు' పాట ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. క్రిస్ హేమ్స్ వర్త్ నటించిన ‘ఎక్స్ ట్రాక్షన్ 2’ జూన్ 16 నాడు నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవుతుంది.
View this post on Instagram
Read Also: సోషల్ మీడియాకు కాజోల్ గుడ్ బై, వెళ్తూ వెళ్తూ కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బ్యూటీ