News
News
X

Raviteja: రవితేజ 'ఈగల్' - హాలీవుడ్ 'జాన్ విక్'కి ఫ్రీమేకా?

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఇప్పుడు మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు.

FOLLOW US: 

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. 'క్రాక్' సినిమా తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారాయన. ఈ మధ్యకాలంలో వచ్చిన 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' ఈ సినిమాలేవీ వర్కవుట్ కాలేదు. అయినప్పటికీ రవితేజ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన 'ధమాకా', 'టైగర్ నాగేశ్వరరావు', 'రావణాసుర' వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. 

ఇంతలో మరో సినిమా ఒప్పుకున్నారు. అదే 'ఈగల్'. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఇప్పుడు మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. దీనికి 'ఈగల్' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అదేంటంటే.. ఈ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకి ఫ్రీమేక్ అని టాక్. హాలీవుడ్ లో 'జాన్ విక్' సినిమాలు ఎంత పాపులరో తెలిసిందే. 2014లో వచ్చిన 'జాన్ విక్' కథను అడాప్ట్ చేసుకొని రవితేజతో తీయాలనుకుంటున్నారు కార్తిక్ ఘట్టమనేని. 'జాన్ విక్' సినిమాలకు సంబంధించి రీమేక్ రైట్స్ అమ్మే ఛాన్స్ లేదు. కాబట్టి రవితేజ సినిమా ఫ్రీమేక్ అనే చెప్పుకోవాలి. తెలుగుకి తగ్గట్లు కథలో మార్పులు, చేర్పులు చేసి.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాలనేది దర్శకుడి ప్లాన్. 

దర్శకుడు రెడీ చేసుకున్న ఎడాప్షన్ స్టోరీ రవితేజకి నచ్చడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే నెల నుంచి పోలాండ్ లో సినిమా షూటింగ్ ను నిర్వహించనున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో కనిపించనుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ 'కార్తికేయ2'తో హిట్ అందుకుంది. రవితేజ సినిమా కోసం ఆమె రెమ్యునరేషన్ కూడా పెంచిందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాను నిర్మించనున్నారు. 

Also Read : గుణశేఖర్ అవుట్ - త్రివిక్రమ్ చేతికొచ్చిన రానా డ్రీమ్ ప్రాజెక్ట్!

Also Read : మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే - సినిమా జానర్ రివీల్ చేసిన రాజమౌళి

ఇక రవితేజ ఇతర ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. 'టైగర్ నాగేశ్వరావు' సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడా రాజీపడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. వంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. స్టువర్ట్‌పురం రాబిన్ హుడ్ గా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా 70 వ దశకం నాటి స్టువర్ట్‌పురం నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా కోసం రవితేజ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 

మెగా154లో రవితేజ:

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సినిమాలో రవితేజను కీలకపాత్ర కోసం ఎన్నుకున్నారు. కథ ప్రకారం.. చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  

షూటింగ్ దశలో 'ధమాకా':

త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ధమాకా'(Dhamaka). 'డబుల్ ఇంపాక్ట్'... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఆ ట్యాగ్ లైన్ వెనుక కారణం అదే. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు. ఇటీవల సినిమాకి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను విడుదల చేశారు. 

Published at : 13 Sep 2022 07:55 PM (IST) Tags: raviteja Eagle movie karthik ghattamaneni jhon wick movie

సంబంధిత కథనాలు

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?