అన్వేషించండి

Trivikram Rana Movie : గుణశేఖర్ అవుట్ - త్రివిక్రమ్ చేతికొచ్చిన రానా డ్రీమ్ ప్రాజెక్ట్!

రానాకు మైథలాజికల్ సినిమా చేయాలని కోరిక. గుణశేఖర్ దర్శకత్వంలో ఒక సినిమా అనుకుని, కథపై చాలా రోజులు వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన్ను తప్పించి... ఆ సినిమాను త్రివిక్రమ్ చేతిలో పెట్టారని ఇండస్ట్రీ టాక్.

ప్రజెంట్ టాలీవుడ్ యంగ్ హీరోల్లో తెలుగు మీద మంచి పట్టు ఉన్న వాళ్ళలో రానా దగ్గుబాటి (Rana Daggubati) ఒకరు. తెలుగు సంభాషణలు పలకడంలో, ఉచ్ఛారణ విషయంలోనూ ఆయన పర్ఫెక్ట్ అని చెప్పాలి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హీరోగా నటించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రంలో నాటకాలు ప్రదర్శించే సన్నివేశాల్లో పౌరాణిక డైలాగులు కూడా అలవోకగా చెప్పారు. ఆయనకు ఫుల్ లెంగ్త్ పౌరాణిక సినిమా చేయాలని ఉంది. హిందూ మైథలాజికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు.

గుణశేఖర్ దర్శకత్వంలో మొదలైనా...
గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్య కశ్యప' (Hiranyakashyap Telugu Movie) కథ చేయాలని కొన్ని ఏళ్లుగా రానా ప్రయత్నిస్తున్నారు. స్క్రిప్ట్ డిస్కషన్స్ నుంచి ప్రీ విజువలైజేషన్ వరకు చాలా వర్క్స్ జరిగాయి. రానా తండ్రి, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబుకు గుణశేఖర్ వర్క్ మీద పూర్తిస్థాయిలో సంతృప్తి రాలేదట. అందుకని, ఆ సినిమాను పక్కన పెట్టేశారట. ఇప్పుడు ఆ కథను త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) చేతిలో పెట్టారని సమాచారం. 

త్రివిక్రమ్ చేతికొచ్చిన 'హిరణ్య కశ్యప'
లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్య కశ్యప' సినిమాను రానా చేయడం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే, అదీ ఇప్పుడు కాదు. ఆ సినిమా స్టార్ట్ కావడానికి మరో ఏడాది లేదా ఏడాదిన్నర సమయం పడుతుందని సమాచారం.

Also Read : మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే - సినిమా జానర్ రివీల్ చేసిన రాజమౌళి

'భీమ్లా నాయక్' సినిమాతో రానా, త్రివిక్రమ్ మధ్య పరిచయం పెరిగింది. అప్పుడు 'హిరణ్య కశ్యప' డిస్కషన్ వచ్చిందట. స్వతహాగా త్రివిక్రమ్‌కు హిందూ పురాణాలు, ఇతిహాస గ్రంథాలపై ఆసక్తి ఎక్కువ. ఆయన మంచి పట్టు ఉంది. 'హిరణ్య కశ్యప' కథకు తనదైన టచ్ ఇవ్వడంతో... ఆయన్ను సినిమా చేయమని రానా ఒత్తిడి చేశారట. పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయడానికి త్రివిక్రమ్ కూడా ఓకే అన్నారట.
 
త్రివిక్రమ్ రాకతో నిర్మాత మార్పు!
'హిరణ్య కశ్యప' సినిమాను తొలుత సురేష్ ప్రొడక్షన్స్ మీద ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. గుణశేఖర్‌కు కూడా భాగస్వామిగా ఏవో చర్చలు జరిగాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో తప్ప ఇతర నిర్మాణ సంస్థలకు సినిమాలు చేయడం లేదు. అందుకని, 'హిరణ్య కశ్యప' సినిమాను హారిక అండ్ హాసినిలో చేయడానికి రానా కూడా ఓకే అన్నారట. ఆల్రెడీ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారని టాక్. గుణశేఖర్ కథకు, త్రివిక్రమ్ కథకు చాలా డిఫరెన్స్ ఉందని సురేష్ ప్రొడక్షన్స్ వర్గాల కథనం. 

మహేష్, బన్నీ సినిమాల తర్వాత రానాతో...
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ ఒక సినిమా (SSMB28 Movie) చేస్తున్నారు. 'అతడు', 'ఖలేజా' తర్వాత వాళ్ళిద్దరి కలయికలో హ్యాట్రిక్ చిత్రమిది. ఇది పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ హీరోగా మరొక సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రానా దగ్గుబాటి 'హిరణ్య కశ్యప' సినిమా ఉంటుందట. 

'విరాట పర్వం' తర్వాత రానా మరొక సినిమా చేయలేదు. 'హిరణ్య కశ్యప' సినిమా స్టార్ట్ అయ్యే వరకూ మరో సినిమా చేయకూడదని, ఏడాది పాటు కాలీగా ఉండాలని ఆయన ప్లాన్ చేసుకున్నారట.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Aus vs Ind First Test First Innings | పెర్త్ లో పేకమేడను తలపించిన టీమిండియా | ABP Desamపేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Embed widget