Ram Charan- Upasana: ఉపాసనకి ఆరో నెల - ఆస్కార్ వేడుకల్లో క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
ఉపాసన ప్రెగ్నెన్సీ మీద వస్తున్న పుకార్లకు ఆస్కార్ వేడుకల్లో క్లారిటీ ఇచ్చారు రామ్ చరణ్. మరో మూడు నెలల్లో బుజ్జాయి తమ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నట్టు చెప్పారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నారు. ఆయన సతీమణి ఉపాసన కామినేని కొణిదెల పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. దాదాపు పదకొండేళ్ల తర్వాత ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. దీంతో ప్రస్తుతం అందరీ చూపు వీళ్ళ మీదే. ఉంది. మొదట్లో సరోగసీ పద్ధతి ద్వారా బిడ్డని కంటున్నారని పుకార్లు షికార్లు చేశాయి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ బేబీ బంప్ ఫోటోస్ రివిల్ చేసింది ఉపాసన. ఇప్పుడు చెర్రీ - ఉపాసనకి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే మరో మూడు నెలల్లో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి బుల్లి బుజ్జాయి అడుగుపెట్టబోతున్నారు.
అమెరికాలో అట్టహాసంగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో చరణ్ దంపతులు పాల్గొన్నారు. బ్లాక్ కలర్ సూట్, క్రీమ్ కలర్ శారీలో రాయల్ లుక్ లో మెరిసిపోతూ రెడ్ కార్పెట్ మీద నడిచారు. ఈ సందర్భంగా అక్కడి వీరిద్దరితో మాట్లాడగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. "రామ్ ని ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యామిలీలో భాగం అయ్యేందుకు ఇక్కడికి వచ్చాను. కొంచెం నెర్వస్ గా ఉంది. కానీ చాలా సంతోషంగా ఉంది" అని ఉపాసన చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ అభిమానులకు ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ ఇచ్చారు. ‘‘తను ఇప్పుడు ఆరో నెల గర్భవతి. పుట్టబోయే బిడ్డ మాకు ముందుగానే ఎంతో అదృష్టం తెచ్చిపెడుతోంది’’ అని చరణ్ చెప్పుకొచ్చారు. అమెరికా వెళ్ళడానికి కొద్ది రోజుల ముందే ఉపాసన స్నేహితులందరూ కలిసి ఆమెకు సీమంతం కూడా చేశారు. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.
Also Read: ఇదంతా నిజంగా కలలాగే ఉంది - ఆస్కార్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ఏమన్నారంటే?
రామ్ చరణ్ దంపతులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆస్కార్ అవార్డుల కోసం చెర్రీ అమెరికా వెళ్లారు. భర్త వెంటే భార్య అని ఉపాసన కూడా అక్కడే ఉన్నారు. ఇద్దరూ కలిసి షాపింగ్ చేసిన్ ఫోటోస్ ఎప్పటికప్పుడు ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. అందులో అన్నింటికంటే ఎక్కువ వైరల్ అయిన ఫోటో షాపింగ్ బ్యాగులు చరణ్ మోస్తూ ఉంటే ముందు స్టైలిష్ గా ఉపాసన నడుస్తూ వెళ్ళడం. ఇంటర్నేషనల్ స్టార్ అయినా కూడా భార్య బరువు, బాధ్యతలు మోయాల్సిందే అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెట్టారు.
డెలివరీకి అమెరికన్ గైనకాలజిస్ట్
గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న రామ్ చరణ్ తన వృత్తి విషయాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ ఉపాసనకి డెలివరీ చేయనున్నారు. తొలుత అసలు ఉపాసనకి అమెరికాలోని డెలివరీ ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ చరణ్ వాటి మీద కూడా క్లారిటీ ఇచ్చారు. అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో కో హోస్ట్! ఆమెను కలవడం సంతోషంగా ఉందని చెప్పిన చరణ్... ఫోన్ నంబర్ తీసుకుంటానని పేర్కొన్నారు. తన భార్య (ఉపాసన) అమెరికా వస్తుందని, డెలివరీకి అందుబాటులో ఉంటే బావుంటుందని జెన్నిఫర్ ఆస్టన్ (Jennifer Ashton) తో చరణ్ తెలిపారు. అందుకు జెన్నిఫర్ ఒకే అన్నారు. ''మీతో ట్రావెల్ చేయడానికి రెడీ. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడం నాకు గౌరవమే'' అని ఆమె పేర్కొన్నారు.
జెన్నిఫర్ ఆస్టన్ టూ స్వీట్ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. త్వరలో ఆమెను కలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇండియాలోని అపోలో ఆస్పత్రుల కుటుంబంలో డాక్టర్లు సుమనా మనోహర్, రూమా సిన్హాతో కలిసి డెలివరీ చేయాలని రిక్వెస్ట్ చేశారు. అందుకు జెన్నిఫర్ ఓకే చెప్పారు. సో, అపోలోలో ఉపాసన డెలివరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట. అదీ సంగతి!
Also Read : 'నాటు నాటు'కు ఆస్కార్ - సరికొత్త చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'