Pushpa 2 First Night: పుష్ప 2 ఫస్ట్ నైట్ - యూట్యూబ్‌లో వైరల్ అవుతోన్న షార్ట్ ఫిల్మ్
Pushpa 2 Spoof Video: 'పుష్ప' విడుదలయ్యాక యూట్యూబ్ లో కొందరు షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అయితే... ఈ షార్ట్ ఫిల్మ్ కొంచెం డిఫరెంట్. 'పుష్ప 2' ఫస్ట్ నైట్ పేరుతో చేసిన షార్ట్ ఫిల్మ్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో 'పుష్ప : ది రైజ్' సినిమా ఓ మైలురాయి. తెలుగు సినిమాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సినిమాగా 'పుష్ప' పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచి ఉంటుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనూ ఈ సినిమాను ఓ మైలురాయిగా చెప్పుకోవాలి. తెలుగు కథానాయకుడికి జాతీయ అవార్డు తీసుకు వచ్చిన సినిమాగానూ 'పుష్ప' రికార్డులకు ఎక్కింది.
'పుష్ప : ది రైజ్' విడుదలైన తర్వాత 'తగ్గేదే లే' మేనరిజం పాపులర్ అయ్యింది. ఇక, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే క్రికెట్ అభిమానులకో ఆ మేనరిజాన్ని పరిచయం చేశారు. యూట్యూబ్ ఫిలిమ్స్ తీసే కొందరు అల్లు అర్జున్ క్యారెక్టర్, ఆ సిట్యువేషన్స్ బేస్ చేసుకుని షార్ట్ ఫిల్మ్స్ తీశారు. కొత్తగా వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్ మాత్రం సంథింగ్ డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకు అంటే...
'పుష్ప 2' ఫస్ట్ నైట్... వైరల్ కంటెంట్!
యూట్యూబ్. డిజిటల్ మీడియాలో స్పైసీ కంటెంట్ వీడియోలతో '7 ఆర్ట్స్' ఛానల్ తక్కువ కాలంలో పాపులర్ అయ్యింది. ఆ ఛానల్ వీడియోస్ ద్వారా పాపులర్ అయిన సరయు వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకున్నారు. '18 పేజెస్' సినిమాలో నిఖిల్ స్నేహితురాలిగా సరయు నటించారు. ఇంకా 'సకల గుణాభి రామ', 'తొలి పరిచయం' సినిమాల్లోనూ కనిపించారు. శ్రీకాంత్ రెడ్డి కూడా '7 ఆర్ట్స్' ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయ్యారు. ఇప్పుడీ ఛానల్‌లో తాజాగా 'పుష్ప 2 ఫస్ట్ నైట్' పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ విడుదల అయ్యింది. ప్రజెంట్ నెట్టింట ఆ ఫిల్మ్ వైరల్ అవుతోంది.
పెళ్ళి తర్వాత పుష్ప ఫస్ట్ నైట్ ఎలా ఉంటుందంటే?
'పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్' పేరుతో 7 ఆర్ట్స్ ఛానల్ టీమ్ చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ అయ్యింది. 'పుష్ప' సినిమాలో పుష్ప రాజ్ అల్లు అర్జున్ పాత్రలో నటించారు. ఈ 'పుష్ప 2 ఫస్ట్ నైట్'లో అటువంటి రోల్ శ్రీకాంత్ రెడ్డి చేశారు. రష్మికా మందన్నాను పోలిన శ్రీవల్లి పాత్రలో సీమ నటించారు.
Also Read: పాపం కోలీవుడ్ స్టార్ విజయ్... దళపతిని బామ్మ గుర్తు పట్టలేదు
'పుష్ప 2 ఫస్ట్ నైట్'లో పుష్ప రాజ్ క్యారెక్టర్ చేసిన శ్రీకాంత్ రెడ్డి... ఈ లఘు చిత్రానికి రచయిత, దర్శకుడు, ఎడిటర్ కూడా! పెళ్లి తర్వాత పుష్ప రాజ్ ఫస్ట్ నైట్ ఎలా ఉంటుందనేది కాన్సెప్ట్! దానిని తన స్టైల్‌లో శ్రీకాంత్ రెడ్డి చేశారు.
షెకావత్ తనను బ్రాండ్ అంటూ అవమానించడం, పుష్ప రాజకీయాల్లోకి రావాలనుకోవడం, తన ఇంటి పేరు తనకు తిరిగి వచ్చి ఓ బ్రాండ్ ఏర్పడటం ఇలా శ్రీకాంత్ రెడ్డి రాసుకున్న స్పూఫ్ లైన్ నెటిజనులను అట్ట్రాక్ట్ చేస్తోంది. ఇందులో శ్రీకాంత్ రెడ్డి నటన, చిత్తూరు యాస బాగుంది. అన్ని పాత్రలు చక్కగా కుదిరాయి. ఈ స్ఫూప్ ఎంతో ఫన్నీగా ఉందని కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తుంటే... మరికొందరు చిన్నగా విమర్శలు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ షార్ట్ ఫిల్మ్ వైరల్ అవుతోంది.
Also Read: ముట్టుకోవద్దని చెప్పాను కదరా... ప్రభాస్‌ను వాడుకున్న పోలీసు