Prabhas Hyderabad Police: ప్రభాస్‌ను వాడుకున్న పోలీసులు
రెబల్ స్టార్ ప్రభాస్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ ఫుల్లుగా వాడుకుంది. ఇయర్ ఎండ్ పార్టీలకు వెళ్ళే మందు బాబులకు ముందుగా స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అది ఏమిటో తెలుసుకుందామా?
![Prabhas Hyderabad Police: ప్రభాస్‌ను వాడుకున్న పోలీసులు Hyderabad City Police uses Prabhas for raising awareness about drink and drive Prabhas Hyderabad Police: ప్రభాస్‌ను వాడుకున్న పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/31/a693024d29efa279e02ec0240cbd25161703995600508313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మందుబాబులకు హైదరాబాద్ పోలీస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అందుకు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)ను వాడుకుంది. ఆయన కొత్త సినిమా 'సలార్' సినిమాలోని పాపులర్ డైలాగ్ వాడుకుని సోషల్ మీడియాలో డ్రంక్ & డ్రైవ్ వల్ల కలిగే నష్టం గురించి చెప్పే ప్రయత్నం చేసింది సిటీ పోలీస్ శాఖ. పూర్తి వివరాల్లోకి వెళితే...
న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన ప్రజలు
డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రపంచం అంతా రెడీ అయ్యింది. అందులో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మన తెలుగు గడ్డపై పార్టీల విషయానికి వస్తే... తెలంగాణ రాజధాని హైదరాబాద్ సిటీలో పలు పబ్‌లు, రెస్టారెంట్‌లలో స్పెషల్ ఏర్పాట్లు చేశారు. ఈ ఒక్క రాత్రి లిక్కర్ సేల్స్ గణనీయంగా ఉంటుందని కొన్నేళ్ళ నుంచి ఆబ్కారీ శాఖ విడుదల చేసే గణాంకాలు చూస్తే తెలుస్తుంది. మందు తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరిగిన సందర్భాలు కోకొల్లలు. వాళ్ళకు ప్రభాస్ డైలాగ్ ద్వారా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
డోంట్ డ్రింక్ & డ్రైవ్... కైండ్ లీ రిక్వెస్ట్
'ముట్టుకోవద్దని చెప్పాను కదరా' - 'సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్' సినిమాలో ప్రభాస్ చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్. హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించిన డ్రంక్ అండ్ డ్రైవ్ యాడ్‌లో ముందు ఆ డైలాగ్ వాడారు. అంటే... మందు మట్టుకోవద్దని పోలీసులు చెబుతున్నారు.
మందు ముట్టుకోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయని ఆ తర్వాత విజువల్స్ ద్వారా చెప్పారు. 'ప్లీజ్ ఐ కైండ్ లీ రిక్వెస్ట్' డైలాగ్ తర్వాత 'డోంట్ డ్రింక్ & డ్రైవ్' అని పేర్కొన్నారు. అదీ సంగతి.
Also Read: బన్నీ పాట మహేష్‌కు... కుర్చీ మడతపెట్టి కాపీయే
“Don’t let one night of fun turn into a lifetime of guilt.”
— Hyderabad City Police (@hydcitypolice) December 30, 2023
Don't Drink & Drive, Stay Safe.#DriveSafe #DontDrinkAndDrive #ArriveAlive #RoadSafety #SaveLives #Salaar #HyderabadCityPolice pic.twitter.com/e8HYJN5la7
ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసిన 'సలార్'
థియేటర్లలో డిసెంబర్ 22న 'సలార్' విడుదల అయ్యింది. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి షోస్ వేయడం మొదలు పెట్టారు. ప్రభాస్ అభిమానులు, ఇంకా సగటు ప్రేక్షకుల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్లు కలెక్ట్ చేసింది. సంక్రాంతి వరకు థియేటర్లలో ఈ సినిమాకు అడ్డు లేదు. మరి, 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి.
Also Read: బబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?
'సలార్' సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటించారు. అయితే... వాళ్ళిద్దరి మధ్య ఒక్క పాట కూడా లేదు. ఇంకా చెప్పాలంటే లవ్ సీన్ కూడా లేదు. కానీ, ఓ సన్నివేశంలో ప్రభాస్ హీరోయిజం చూసి శృతి హాసన్ ఇంప్రెస్ అయినట్లు చూపించారు. మరి, సీక్వెల్ వస్తే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు ఏమైనా చూపిస్తారేమో చూడాలి. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)