Kurchi Madatha Petti: బన్నీ పాటను మహేష్‌కు కొట్టిన తమన్, కుర్చీ మడతపెట్టి కాపీయే
తమన్ న్యూ సాంగ్ రిలీజైన వెంటనే ఫలానా పాటకు కాపీ అంటూ ట్రోల్స్ రావడం కామన్! ఇప్పుడు 'కుర్చీ మడతపెట్టి...' సాంగ్ కూడా తమన్ కాపీ చేశారని ట్రోల్ చేస్తున్నారు.
Mahesh Babu's Guntur Kaaram movie new song Kurchi Madatha petti is copy of Allu Arjun's blockbuster song from Sarrainodu movie: 'గుంటూరు కారం' సినిమాలో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ మీద నెట్టింట బోల్డంత డిస్కషన్ జరుగుతోంది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఓ ముసలాయన బూతు మాట చెబితే ఆ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఆ బూతు పదం మీద పాట ఏంటని కొందరు జనాలు విమర్శలు చేస్తున్నారు. సాహిత్యానికి, తెలుగు భాషకు ఎంతో విలువ ఇచ్చే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు ఆ పాటను ఎలా ఓకే చేశారని ప్రశ్నిస్తున్నారు. అది పక్కన పెడితే...
అల్లు అర్జున్ పాటను మళ్ళీ కొట్టేశావా తమన్?
ఇప్పుడు 'కుర్చీ మడతపెట్టి...' పాట విడుదలైంది. సాంగ్ స్టార్టింగులో వచ్చే చిన్న మ్యూజిక్ బిట్ ఆల్రెడీ యూట్యూబ్‌లో పాపులర్. ఓ డీజేకి డబ్బులు ఇచ్చి మరీ తమన్ ఆ మ్యూజిక్ వాడుకున్నారని సమాచారం. ఆ బిట్ తీసేస్తే మిగతా ట్యూన్ కొత్తగా లేదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమా గుర్తు ఉందా? అందులో స్పెషల్ సాంగ్ ఉంది కదా. తెలుగమ్మాయి అంజలితో అల్లు అర్జున్ స్టెప్స్ వేశారు... 'బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే' అంటూ. 'కుర్చీ మడతపెట్టి...' సాంగ్ వింటుంటే ఆ సాంగ్ విన్నట్టు ఉంది. నెటిజనులు సైతం ఆ మాటే అంటున్నారు.
Also Read: బబుల్‌గమ్ రివ్యూ: రాజీవ్, సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమైన సినిమా... బావుందా? సాగిందా?
ఎన్నాళ్లు బ్లాక్ బస్టర్ సాంగ్ కొడతావ్ తమన్ అన్నా?
కుర్చీ మడతపెట్టి సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాల్లో నెటిజనులకు తమన్ మరో సారి దొరికారు. అల్లు అర్జున్ సాంగ్ అటు ఇటు తిప్పి మహేష్ బాబుకు కొట్టాడని విమర్శలు చేయడం మొదలు పెట్టారు. 'ఎన్నాళ్ళు బ్లాక్ బస్టర్ సాంగ్ కాపీ కొడతావ్ అన్నా' అంటూ తమన్ (Thaman)ను ఓ నెటిజన్ ప్రశ్నించారు.
Also Read: కళ్యాణ్ రామ్ సినిమాకు కలెక్షన్లు తగ్గాయి, ఆ కామెంట్స్ ఫలితమేనా?
First, Song bavundhi anna
— Mourya (@Mouryanadh) December 30, 2023
Babu kummi kummi vadhiladu
Second, aa blockbuster song enni sarlu kodathav ra luchaaa
Kaani song bavundhi anna#GunturKaaram#KurchiMadathapetti https://t.co/7GBVHAMMf9
మహేష్ బాబు ఎనర్జీయే కాపాడాలి?
కుర్చీ మడతపెట్టి పాటపై వస్తున్న విమర్శలు అలా ఉంచితే... ఆల్రెడీ రిలీజైన లిరికల్ వీడియోలో మహేష్ బాబు వేసిన స్టెప్పులు అభిమానులను అమితంగా అలరిస్తున్నాయి. సూపర్ స్టార్ ఈ విధంగా డ్యాన్స్ చేసి చాలా రోజులు అయ్యిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. తమన్ ట్యూన్ బాలేదని, మహేష్ బాబు ఎనర్జీయే పాటను కాపాడాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ విమర్శల పట్ల తమన్ ఏ విధంగా స్పందిస్తారో?
Babu energy ea kapadali..song bokkala undi#KurchiMadathapetti
— Pranav The headconstable (@sgscripts911) December 30, 2023
Also Read: డెవిల్ రివ్యూ: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా హిట్టా? ఫట్టా?
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' థియేటర్లలోకి వస్తోంది. మహేష్, త్రివిక్రమ్ కాంబోకు తోడు సూపర్ స్టార్ మాస్ స్టిల్స్ సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు కుర్చీ మడతపెట్టి సాంగ్ యాడ్ అయ్యింది. సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు.