ఆఫీసుకు ఎలాంటి శారీ అయితే బావుంటుంది? బబుల్‌గమ్ బ్యూటీ మానసా చౌదరిని ఫాలో అవ్వండి. స్లీవ్ లెస్ బ్లౌజ్, సింపుల్ లైన్స్ ఉన్నవి రెగ్యులర్ గా వేసుకుని వెళ్ళడానికి బావుంటాయి. పార్టీలు ఉన్నప్పుడు డిజైనర్ వర్క్ చేయించిన బ్లౌజ్ అండ్ శారీ అయితే సూపర్ లుక్ ఇస్తుంది. ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇటువంటి కలర్ ఫుల్ శారీ అయితే ఆ ఫీల్ వేరు. సింపుల్ కలర్స్ & ఫ్లవర్స్ ప్రింటెడ్ శారీ మధ్య మధ్యలో కడితే కొత్తగా ఉంటుంది. ఆఫీసుకు మాత్రమే కాదు... బీచ్‌కు కూడా ఇలా శారీలో వెళ్ళవచ్చు. ప్లెయిన్ కలర్ శారీ, సింపుల్ జ్యువెలరీ అయితే మీ అందం మరింత రెట్టింపు అవుతుంది. శారీ కంఫర్టబుల్‌గా ఉంటుందా? లుక్ బావుంటుందా? అనే డౌట్ అవసరం లేదు. చూశారుగా... మానస ఎలా కూర్చున్నారో? ఆఫీసుకు ఎప్పుడైనా రెట్రో థీమ్ పార్టీ జరిగితే... ఈ లుక్ బావుంటుంది. ఆరు గజాల చీర కడితే... అమ్మాయి అందమే వేరు కదూ! (all images courtesy: maanasa.choudhary1 / instagram)