ముల్లంగి ఆకులను పడేస్తున్నారా? అయితే, మీరు ఇవి కోల్పోతున్నట్టే! ముల్లంగి ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముల్లంగి ఆకుల్లోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి కాపాడుతుంది. ముల్లంగి ఆకుల్లోని ఐరన్ హిమోగ్లోబిన్ పెంచి రక్తహీనత నుంచి కాపాడుతుంది. ముల్లంగి ఆకుల్లోని పీచు పదార్థాలు రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి. ముల్లంగి ఆకుల్లోని సోడియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. ముల్లంగి ఆకుల్లోని విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. All Photos Credit: Pixabay.com