ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అదనంగా చక్కెర చేర్చిన పానీయాలు, తినుబండారాలను వీలైనంత తగ్గించుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. వీటి వల్ల లివర్ లో ఇన్ఫ్లమేషన్ రావచ్చు. ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవద్దు. ఉప్పు ఎక్కువైతే శరీరంలో నీరు చేరుతుంది. లివర్‌కు ఇది మంచిది కాదు. ఆల్కాహాల్ ప్రభావం లివర్ మీద నేరుగా ఉంటుంది. కనుక పరిమితిలో తీసుకోవడం లేదా తీసుకోకపోవడం మంచిది. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవద్దు. వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు, ఇతర పదార్థాలు ఉండొచ్చు. ప్రాసెస్ చేసిన మాంసాహారం తీసుకోవద్దు . ఇది లివర్ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. వైట్ బ్రెడ్, పాస్తా వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా కలిగి ఆహారం తగ్గించి తీసుకోవాలి. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు Images courtesy : Pexels