అరటి పండులో ఫైబర్ ఎక్కువ కనుక జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

అసిడిటి వల్ల గుండెల్లో మంటగా ఉంటే ఒక అరటి పండు తింటే చాలు ఉపశమనం దొరుకుతుంది.

మూడ్ బాగుచేసే హార్మోన్ సెరొటోనిన్. అరటిలో ఉండే ట్రిప్టోపాన్ సెరొటోనిన్ గా మారుతుంది.

అరటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ట్రిప్టోపాన్ వల్ల నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది.

అరటి పండుతో బీపీ తగ్గుతుంది. రక్తనాళాల్లో పెరిగిన ఒత్తిడివల్ల కలిగే తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

అరటిలో ఉండే సుక్రోజ్, ఫ్రక్టోజ్ వల్ల తిన్న వెంటనే శక్తి లభిస్తుంది. అరటిలో ఐరన్ కూడా ఉంటుంది. కనుక నీరసం దూరం అవుతుంది.

అరటి పండులో పైరిడాక్సిన్ అనే బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది. ఇది శ్వాసవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

ఇది బీపి అదుపులో ఉంచుతుంది. నాడీ వ్యవస్థ, ఎముకల బలానికీ మంచిదే. కాబట్టి రోజూ తినొచ్చు.

ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు

Images courtesy : Pexels