చేపలు తాజావో, కాదో తెలుసుకొనేందుకు ఈ టిప్స్ పాటించండి చేపలు ఆరోగ్యానికి చాలామంచివి. వారంలో కనీసం 2 సార్లు చేపలు తింటే పోషకాలు లభిస్తాయి. అయితే, కొందరికి తాజా చేపలు కొనడం చేతకాదు. వారి కోసమే ఈ టిప్స్. చేపలు తాజాగా ఉంటేనే వంటలు రుచిగా ఉంటాయి. కాబట్టి, చేపలు కొనేప్పుడు ఇలా చేయండి. చేపలు నుంచి పుల్లటి నీచు కంపు కొడితే కొనవద్దు. బాగా పాడైన చేపలే అలా కంపు కొడతాయి. చేపల మొప్పలను తెరిచి చూస్తే ముదురు పింక్ కలర్‌లో ఉండాలి. కోస్తున్నప్పుడు రక్తం కూడా అదే రంగులో ఉండాలి. చేపల కళ్లు మూసుకుని, తెల్లని పొరతో కనిపిస్తే కొనవద్దు. అవి తాజా చేపలు కాదు. కళ్లు మెరుస్తున్నట్లు ఉండాలి. చేప శరీరం మెరుస్తుండాలి. చేతితో నొక్కితే దాని చర్మం లోపలికి వెళ్లకూడదు. కాస్త జారుతున్నట్లుగా చర్మం ఉండాలి. చేపలు కోసినప్పుడు ముక్క సర్సుమని తెగాలి. మెత్తగా సాగుతున్నట్లు ఉంటే అది నిలవ చేపని అర్థం. తాజా చేపల పొలుసులు స్ట్రాంగ్‌గా ఉంటాయి. అంత ఈజీగా ఊడిరావు. అవి రాలుతున్నట్లయితే ఆ చేప తాజాది కాదు. Images Credit: Pexels