ఆయుర్వేదంలో మలబద్దాకానికి కొన్ని సులభ పరిష్కారాలు ఉన్నియి. అవేమిటో తెలుసుకుందాం.

మలబద్దకానికి త్రిఫల చాలా ప్రాచూర్యంలో ఉన్న పరిష్కారం. ఆమ్లా, హరితకి, బిభితకి అనే మూడు ఫలాలతో తయారుచేస్తారు.

ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాసు వెచ్చని నీటితో కలిపి రాత్రి నిద్రకు ముందు తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది.

ఆయుర్వేదంలో ఆముదం ఒక మంచి విరేచనకారి. ఒక టీస్పూన్ ఆముదం ఒక కప్పు వెచ్చని పాలతో రాత్రి తీసుకుంటే చాలు

భోజనం తర్వాత ఒక టీ స్పూన్ సోంపు నమిలితే జీర్ణక్రియ సజావుగా ఉంటుంది. మలబద్దకం ఏర్పడదు.

వీలైతే రోజంతా లేదంటే కనీసం ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

నెయ్యిని కొద్ది మొత్తంలో ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. ఒక టీ స్పూన్ వెచ్చని పాలతో లేదా వంటలోనూ నెయ్యి వాడడం మంచిది.

ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు

Images courtesy : Pexels