Puneeth Rajkumar: నెల క్రితమే మాట్లాడాను... కలుద్దామని అనుకునేలోపు ఇలా! - పూరి జగన్నాథ్ భావోద్వేగం
#puneethrajkumar పునీత్ రాజ్ కుమార్ హీరోగా పరిచయమైన 'అప్పు' చిత్రానికి దర్శకత్వం వహించిన పూరి జగన్నాథ్... పునీత్ మరణంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భావోద్వేగానికి లోనయ్యారు.
"రాజ్ కుమార్ గారు లేరు. పార్వతమ్మగారు లేరు. వరదమ్మ గారు లేరు. పునీత్ కూడా లేరు అంటే నిజంగా తట్టుకోలేకపోతున్నాను. అతడిది చాలా చిన్న వయసు. కుర్రాడు. నెల క్రితమే ఇద్దరం మాట్లాడుకున్నాం. సరదాగా కలుద్దామని అనుకున్నాం. ఈలోపు ఇలా జరిగింది" అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా పరిచయమైన 'అప్పు' సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. పునీత్ మరణం వాళ్ల కుటుంబానికి, అభిమానులకు మాత్రమే కాదు... కన్నడ పరిశ్రమకు పెద్ద లోటు అని పూరి జగన్నాథ్ చెప్పారు.
గుండెపోటుతో పునీత్ హాఠాన్మరణం చెందడంతో ఆయనతో తనకున్న అనుబంధాన్ని పూరి జగన్నాథ్ గుర్తు చేసుకున్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ "ఎవరూ మరణం ఎప్పుడొస్తుందో ఊహించలేం... నాకు తెలుసు! కానీ, పునీత్ రాజ్ కుమార్ మరణవార్త షాక్ కి గురి చేసింది. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. నాకు పునీత్ చాలా క్లోజ్. తన మొదటి సినిమా (హీరోగా) 'అప్పు' చేశాను. నాకు ఆ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. బేసిగ్గా పునీత్ చాలా మంచోడు. ఎంతోమందిని ఆదుకున్నాడు. ఎంతోమందికి సాయం చేశాడు. అటువంటి మనిషి దూరం కావడం... నేను జీర్ణించుకోలేకపోతున్నాను" అని అన్నారు.
Gone too soon ..
— Charmme Kaur (@Charmmeofficial) October 29, 2021
Can’t believe that @PuneethRajkumar is no more 💔
We will miss u .. #RIP #puneethrajkumar 💔 pic.twitter.com/SWbAHfIQ1T
Also Read: గుండెపోటుతో కన్నడ పవర్‌స్టార్ మృతి
Also Read: కర్ణాటకలో హైఅలర్ట్.. థియేటర్లు మూసేసిన ప్రభుత్వం
Also Read: మాస్టర్ లోహిత్ నుంచి మిస్టర్ పునీత్ వరకు....
Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన
Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
Also Read: పునీత్ మరణం నమ్మశక్యంగా లేదు.. పవన్ భావోద్వేగం...
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్
Also Read: 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!
Also Read: 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!
Also Read: వరుడు కావలెను సమీక్ష: ఈ వరుడు చాలా రొటీన్ గురూ...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి