అన్వేషించండి

Dil Raju: నేను ట్రాక్ తప్పాను.. నాగ వంశీ ట్రాక్ తప్పలేదు, ఫెయిల్యూర్స్ ఒప్పుకున్న దిల్ రాజు!

Dil Raju :నిర్మాత దిల్ రాజు తన కెరీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తాను ట్రాక్ తప్పానన్నారు. నాగవంశీ మాత్రం ఆ తప్పు చేయలేదన్నారు. అందుకే, అతడిలో తనను వెతుక్కుంటున్నట్లు చెప్పారు.

Dil Raju About Naga Vamshi: తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరు దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన, ‘దిల్’ సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఎంతో మంది యువ దర్శకులకు అవకాశం కల్పించారు.

‘దిల్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సుకుమార్ తో కలిసి ‘ఆర్య’ అనే సినిమా చేశారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత భాస్కర్ తో కలిసి ‘బొమ్మరిల్లు’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ బ్యానర్ లో వచ్చిన ‘కొత్త బంగారులోకం’, ‘బృందావనం’, ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’, లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. దిల్ రాజు సినిమా అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ ఉండేది. ప్రస్తుతం దిల్ రాజు ప్లేస్ ను నాగ వంశీ భర్తీ చేసినట్లు అర్థం అవుతోంది.

నాగవంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను- దిల్ రాజు

అటు నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్థాపించి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ లో తెరకెక్కిన పలు సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. తాజాగా నాగవంశీ తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  నాగవంశీలో ఒకప్పటి నన్ను నేను చూసుకున్నట్లు ఉందని చెప్పుకొచ్చారు. తన ఫెయిల్యూర్స్ అందరి ముందు ఒప్పుకున్నారు దిల్ రాజు.

“ఒకప్పుడు నేను చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టేవాడిని. కానీ, ఇప్పుడు ట్రాక్ తప్పాను. దానిని వంశీ కొనసాగిస్తున్నాడు. అందుకే, అతడిలో నన్ను నేను వెతుక్కుంటున్నాను” అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దిల్ రాజు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలాంటి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో దిల్ రాజు తర్వాతే మరెవరైనా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంక్రాంతి బరిలో దిల్ రాజు ‘గేమ్ ఛేంజర్’

దిల్ రాజు ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతిక కానుకగా విడుదలకానుంది.  జనవరి 10 ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నది. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సముద్రఖని, నవీన్ చంద్ర సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

Read Also: ఆ హీరోతో స్పెషల్ సాంగ్ చేయాలనుంది, అసలు విషయం చెప్పేసిన హన్సిక

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget