అన్వేషించండి

Hansika: ఆ హీరోతో స్పెషల్ సాంగ్ చేయాలనుంది, అసలు విషయం చెప్పేసిన హన్సిక

యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ మనసులో మాట బయటపెట్టింది. ఏ హీరోతో స్పెషల్ సాంగ్ చేయాలనుంది? అనే ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది.

Hansika Interesting Comments : యాపిల్ బ్యూటీ హన్సికా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె పలు హిందీ సినిమాల్లో అలరించింది. 16 ఏండ్లకే హీరోయిన్ గా మారింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. తొలి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంది. రామ్ పోతినేని, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది.

తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లలోనూ నటించింది. గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈటీవీలో టెలీకాస్ట్ అవుతున్న ‘ఢీ’ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా మల్లెమాల సంస్థ నిర్వహించిన ఓ చిట్ చాట్ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 

చిట్ చాట్ లో హన్సిక ఏం చెప్పిందంటే?

బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఢీ షోకు జడ్జిగా చేయడం ఎలా ఉందని అడగ్గా, ఇదో గ్రేట్ ఎక్స్ పీరియెన్స్ అని చెప్పుకొచ్చింది. తెలుగు సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాలనుకుంటే, ఏ హీరో పక్కన చేస్తారని ప్రశ్నించగా.. అల్లు అర్జున్ తో చేస్తానని ఠక్కున చెప్పేసింది. బన్నీ ఎనర్జిటిక్, అమేజింగ్ డ్యాన్సర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తింది. ఒకవేళ లిఫ్ట్ లో చిక్కుకుపోతే ఎవరికి కాల్ చేస్తావు? అని అడగ్గా, రవితేజకు ఫోన్ చేస్తానని చెప్పింది. ఆయన ఏదో ఒకటి చేసి లిఫ్ట్ నుంచి తనను కాపాడుతాడని చెప్పింది.

షూటింగ్ కు లేటుగా వెళ్తే చెప్పే కారణం ఏంటి? అని అడగ్గా, తాను షూటింగ్ విషయంలో ఎప్పుడూ లేటుగా వెళ్లలేదని చెప్పింది. ఒకవేళ లేట్ అయ్యిందంటే దానికి కారణం డ్రైవర్ లేదంటే, మేనేజర్ వల్లేనని చెప్పింది. తెలుగులో ఏ హీరోతో నటించాలని ఉంది? అనే ప్రశ్నకు.. పవన్ కల్యాణ్ తో సినిమా చేయలేదని చెప్పిన హన్సిక, వీలుంటే ఆయనతో కలిసి మూవీ చేస్తానని చెప్పింది. తెలుగులో అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పింది. వారంతా తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని వెల్లడించింది.

రాజమౌళి మూవీలో చేయాలనుంది!

ఇక అల్లు అర్జున్, హృతిక్ రోషన్ సినిమాల్లో ఒకేసారి అవకాశం వస్తే ఎవరితో నటిస్తారు? అని ప్రశ్నించగా, ఇద్దరితో సినిమా చేస్తాన్నది. అవసరం అయితే, రెండు షిఫ్టులలో వర్క్ చేస్తానని చెప్పింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ కాకుండా, ఎవరితో పని చేయాలనుంది? అనే ప్రశ్నకు.. రాజమౌళి అని చెప్పింది. చాలా కాలంగా ఆయన సినిమాలో నటించాలని ఎదరుచూస్తున్నట్లు చెప్పింది. ఏమాత్రం అవకాశం లభించినా ఆయన  సినిమాలో చేస్తానని వెల్లడించింది. 

Read Also: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget