కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కియారా తన డెబ్యూనీ గ్రాండ్‌గా ఇచ్చేసింది. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు అందంగా ముస్తాబైంది కియారా. పింక్, బ్లాక్ కాంబినేషన్లో రూపొందించిన ఔట్ఫిట్లో అందంగా రెడీ అయింది. డ్రెస్‌కి తగ్గట్లు హ్యాండ్స్‌కి నెట్టెడ్ బ్లాక్ గ్లౌజ్‌లు వేసుకుని ప్రిన్సెస్‌లా తయారైంది. జుట్టుని హై బన్ వేసుకుని.. అదిరే మేకప్ లుక్‌తో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్లింది. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. A night to remember ✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దానికంటే ముందు వైట్ కలర్ డ్రెస్‌లో హాజరైంది. కియారా కేన్స్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.