రవితేజ కాదండి బాబూ.. శ్రీముఖి నాన్న రామకృష్ణ! యాంకర్ శ్రీముఖి పేరెంట్స్ ఇన్ స్టాలో చేసే సందడి మామూలుగా ఉండదు. అదిరిపోయే పాటలకు దుమ్మురేపే రీల్స్ తో ఆకట్టుకుంటారు. వీళ్ల ఎనర్జీ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతారు. యంగ్ స్టర్స్ ను మించి చేసే డ్యాన్సులు చూసి భలే అని ఆనందిస్తారు. తాజాగా తన కూతురితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు రామకృష్ణ. ఆయనను చూసి అందరూ రవితేజ అని పొరపాటు పడ్డారు. అసలు విషయం తెలుసుకుని శ్రీముఖి తండ్రి అచ్చం రవితేజలా ఉన్నాడే అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. All Photos Credit: Ram Kishan/Instagram