సౌత్ ఇండియాలో సెలబ్రెటీ కపుల్స్లో చిన్మయి, రాహుల్ రవీంద్రన్ ఉంటారు. ఈ జంట నేటితో తమ పదోవ వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిన్మయి తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. చిన్మయి, రాహుల్ ప్రేమకి గుర్తుగా ఇద్దరు కవలలు కూడా ఉన్నారు. అందాల రాక్షసి సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం వీరి ప్రేమకు దారి తీస్తుంది. ఈ సినిమాతో రాహుల్ తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచమయ్యారు. అదే సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠీకి చిన్మయి డబ్బింగ్ చెప్పింది. అప్పటి వారి పరిచయం వారి ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. (Images Source : Instagram/chinmayisripaada)