పేద రైతుకు సర్ ప్రైజ్- గొప్ప మనసు చాటుకున్న లారెన్స్! అభాగ్యులను ఆదుకునే రాఘవ లారెన్స్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. పేద రైతుకు ఉచితంగా ట్రాక్టర్ అందజేసి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. తమిళనాడు విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి ట్రాక్టర్ ను అందించారు. రాజ కన్నన్ చెల్లి భర్త చనిపోవడంతో ఆమెతో పాటు తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. విషయం తెలిసిన లారెన్స్ రాజకన్నన్ కు ట్రాక్టర్ ను బహుమతిగా అందించారు. పేద రైతు కళ్లల్లో ఆనందం చూసి మురిసిపోయారు. ఈ వీడియోను లారెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న 10 మంది రైతులకు ట్రాక్టర్లు ఇవ్వనున్నట్లు లారెన్స్ వెల్లడించారు. లారెన్స్ సాయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Photos & Video Credit: Ragava Lawrence/Instagram