బుల్లితెర నటుడు పవన్‌ సాయి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

మొగలిరేకులు సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్‌ సాయి

ఆ తర్వాత ముద్దు మందారం సీరియల్‌తో బులితెర హీరోగా గుర్తింపు పొందాడు

దాదాపు 13 ఏళ్లుగా పవన్‌ సాయి సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెర నటుడిగా రాణిస్తున్నాడు

అయితే రాజ్‌పుత్‌ కుటుంబానికి చెందిన అతడు గతంలో మధు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు

వైవాహిక బంధంలో కలతల వల్ల భార్యతో విడాకులు తీసుకుని విడిపోయాడు

ఇటీవల దీనిపై చర్చ జరుగుతుండగా పవన్‌ సాయి నేరుగా స్పందించాడు

ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ తన వ్యక్తిగత, వైవాహిక జీవితం గురించి అంతా మాట్లాడుకోవడం ఇష్టం లేదన్నాడు

నేను నా భార్య ఎప్పుడో విడిపోయామని, పరస్పరం అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామన్నాడు

Image Source: All Image Credit: pawon.27/Instagram

ఈ విషయంలో తనకి ప్రైవసీ ఇవ్వాలని, దయచేసిన తన నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా అంటూ పోస్ట్ చేశాడు