తెలుగు సినిమాలతో సమంత టాప్ హీరోయిన్​గా ఎదిగింది. కెరీర్ మొదటి నుంచి హిట్లు అందుకుంది.

2010లో వచ్చిన ఏమాయ చేశావే సినిమాతో సమంత తెలుగులో తన మొదటి సక్సెస్​ను అందుకుంది.

2011లో వచ్చిన దూకుడు సినిమాతో కమర్షియల్ హిట్ అందుకుంది. దీనికి ముందు వచ్చిన బృందావనం కూడా హిట్టే.

ఈగ సినిమాతో నటిగా సమంత మరో మెట్టు ఎక్కింది. రాజమౌళి కాంబినేషన్​లో వచ్చిన ఈ సినిమా సూపర్​ హిట్​గా నిలిచింది.

ఈగ తర్వాత అదే సంవత్సరం(2012)లో ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాతో మ్యూజికల్ హిట్​ని అందుకుంది.

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) సినిమాతో మహేశ్​ బాబుతో కలిసి మరో హిట్​ని అందుకుంది.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్​లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ హిట్​ని అందుకుంది.

2014లో మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ హిట్​ని అందుకుంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ సరసన అఆ సినిమాతో క్రేజీ హిట్​ను అందుకుంది.

రంగస్థలంలో విలేజ్ అమ్మాయిగా నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మజిలీ సినిమా సమంత కెరీర్​లో మైలు రాయిగానే చెప్పవచ్చు. శ్రావణి పాత్రలో జీవించి భారీ హిట్ అందుకుంది.

ఓ బేబి సినిమాతో భారీ కలెక్షన్స్​తో హిట్​ను సొంతం చేసుకుంది. (Images Source: Pinterest)