అన్వేషించండి

సినిమా ఆవకాశాలు రాకపోయినా తగ్గేదేలే అంటోన్న ప్రకాశ్ రాజ్, ఎందుకంటే ?

ప్రకాశ్ చేస్తోన్న విమర్శలు తన సినిమా జీవితం పై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అది నిజమని అనిపిస్తుంది.

నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన విలక్షణ నటనతో భిన్న భాషల్లో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ప్రకాశ్ రాజ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటారు. రాజకీయంగా ఆయన చేసే విమర్శలు చర్చనీయాంశం అవుతుంటాయి. తాను అనుకున్న మాటను నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. ఇటీవల తమిళ నటుడు హీరో విశాల్ కాశీలో పర్యటించారు. అక్కడ ఏర్పాట్లు, సౌకర్యాలు బాగున్నాయని ప్రధాని మోడీ కు ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ చేశారు. దీనికి ప్రకాశ్ రాజ్ కూడా ఘాటుగా స్పందిస్తూ రీ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇలా ఆయన మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రకాశ్ చేస్తోన్న విమర్శలు తన సినిమా జీవితం పై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అది నిజమని అనిపిస్తుంది. రాజకీయంగా తాను చేసే విమర్శల వల్ల తనకు సినిమా అవకాశాలు తగ్గుతున్నాయని అన్నారు. 

గతంలో తనతో కలిసి పని చేసిన వారు ఇప్పుడు కలసి నటించడానికి భయపడుతున్నారన్నారు. తనతో నటిస్తే ఏమవుతుందో అని వారు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ లో కొంతమంది స్టార్ లు తనతో నటించడానికి ఇష్టపడటం లేదని, అయితే దక్షిణాది రాష్ట్రాల్లో  మాత్రం అలాంటి పరిస్థితి రాదని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది నిర్ణయం వల్ల తనకు ఏ మాత్రం నష్టం లేదని, దానికోసం  బాధపడను అని పేర్కొన్నారు. తన భయం మరొకరికి శక్తిగా మారకూడదని, తనకు సినిమా అవకాశాలు రాకపోయినా పర్లేదన్నారు. తాను మాత్రం తగ్గనని, రూటు మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

చాలా మంది నటులు సామాజిక, రాజకీయ విషయాలపై ఎందుకు మాట్లాడరో తాను అర్థం చేసుకోగలను అన్నారు ప్రకాష్ రాజ్. వారిని నేనేమి నిందించడం లేదని, ఎందుకంటే దానిని వారు తట్టుకోలేకపోవచ్చని అన్నారు. స్పందించనంత మాత్రానా వారు తప్పు చేసినట్లు కాదన్నారు. తాను మాత్రం వెనకడుగు వేయనన్నారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీలో ఇటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ప్రకాశ్ రాజ్ చివరిసారిగా దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వన్ 1లో కీలక పాత్ర పోషించారు. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఒక్క తమిళ్ లోనే 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాల లిస్ట్ లో చేరింది. ఈ సినిమా ను 500 కోట్ల తో రెండు భాగాలుగా తెరకెక్కించారు. మొదటి భాగానికే దాదాపు వసూళ్లు వచ్చేశాయి. మొదటి భాగం హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమా రెండో భాగాన్ని కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు మేకర్స్. అలాగే ప్రకాశ్ రాజ్ ఇటీవల విడుదలైన ముఖ్బీర్ – ది స్టోరీ ఆఫ్ ఎ స్పై వెబ్ సిరీస్‌లో కూడా కీలక పాత్ర పోషించాడు.

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today October 28th: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ ఇంట్లో.. సూరజ్ గదిలో జ్యోత్స్న హడావుడి! శివన్నారాయణ ఫ్రెండ్ రాకతో తలదించుకున్న మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్‌ ఇంట్లో.. సూరజ్ గదిలో జ్యోత్స్న హడావుడి! శివన్నారాయణ ఫ్రెండ్ రాకతో తలదించుకున్న మాలిని!
Bigg Boss Season 10 Today October 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్లలో డోంట్‌ కేర్ అంటోన్న ముకేశ్! నామినేషన్స్‌ని కూల్‌గా ముగించిన గోట్స్!
Jagadhatri Serial Today October 27: కోర్టు ముందే సాక్షి యాదగిరిని చంపేసిన మీనన్‌..వంశీకి శిక్షపడేందుకు కేదార్‌ చేసిన సాహసం ఏంటి..?
జగద్ధాత్రి సీరియల్:కోర్టు ముందే సాక్షి యాదగిరిని చంపేసిన మీనన్‌..వంశీకి శిక్షపడేందుకు కేదార్‌ చేసిన సాహసం ఏంటి..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇరగవరం 20వ మైలురాయి.. వణికిపోయిన అంబిక! అఖండ దీపం పగలగొట్టేసిన మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇరగవరం 20వ మైలురాయి.. వణికిపోయిన అంబిక! అఖండ దీపం పగలగొట్టేసిన మహా!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget