By: ABP Desam | Updated at : 23 Dec 2021 08:04 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్దే(Source: UV Creations Twitter)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయింది. సాధారణంగా హైదరాబాద్‌లో జరిగే పెద్ద సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్లకు సుమ యాంకరింగ్ చేయడం కామన్. కానీ ఈసారి యువ సంచలనం నవీన్ పోలిశెట్టి, హాట్ బ్యూటీ రష్మి యాంకరింగ్ చేస్తున్నారు.
జాతిరత్నాలు సినిమాకు ప్రభాస్ ప్రమోషన్ చేశారు. ట్రైలర్ రిలీజ్‌తో పాటు ప్రమోషనల్ వీడియోలో కూడా కనిపించారు. దీంతో నవీన్ కూడా ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి అంగీకరించారు. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సింది లేదు కాబట్టి రాధేశ్యామ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఫుల్ ఫన్ ఉండనుంది.
నవీన్ పోలిశెట్టి తెలుగుకు మాత్రమే కాదు, హిందీ ప్రేక్షకులకూ తెలిసిన ముఖమే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన 'చిచ్చోరే'లో ఫుల్ లెంత్ పాత్రలో నటించాడు. దీంతోపాటు యూట్యూబ్ వీడియోలతో కూడా బాగా ఫేమస్ అయ్యాడు. అవార్డు ఫంక్షన్లకు హీరోలు యాంకరింగ్ చేస్తుంటారు.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు నటించారు. డియర్ కామ్రేడ్ ఫేం జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సంవత్సరం సంక్రాంతికి ఆర్ఆర్ఆర్కు పోటీగా ఈ సినిమా విడుదల కానుంది. నాగార్జున, నాగచైతన్యల బంగార్రాజు కూడా సంక్రాంతికే వస్తుందని టాక్.
The first-ever National Pre-Release Event of💥 #RadheShyam has just begun!
— UV Creations (@UV_Creations) December 23, 2021
🔗 https://t.co/TK2hRxM0vb#RadheShyamPrereleaseEvent#Prabhas @hegdepooja @director_radhaa @TSeries @UV_Creations @GopiKrishnaMvs @AAFilmsIndia pic.twitter.com/G1l2593V3Q
Also Read: సమంతకు అండగా రంగంలోకి దిగిన ఫ్రెండ్... భావోద్వేగ పోస్టు
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్టర్ సంగతేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అనసూయ!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
RRR Visual Effects: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో పులి, పాముకు ఇలా ప్రాణం పోశారు, ఇదిగో VFX వీడియో!
Mahesh Babu vs Bollywood: మహేష్ బాబును నేషనల్ మీడియా టార్గెట్ చేసుకుందా? ఆ యాడ్‌పై ట్రోలింగ్!
Jagapathi Babu: 'ఇది అవసరం, లేకపోతే ఒళ్లు బలుస్తుంది' - జగపతి బాబు కామెంట్స్‌కు నెటిజన్స్ ఫిదా!
Sarkaru Vaari Paata: కొన్ని ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి - 'సర్కారు వారి పాట' టాక్ పై సూపర్ స్టార్ కృష్ణ రియాక్షన్!
Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?
YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !
Gyanvapi Mosque Survey Report: జ్ఞానవాపి మసీదులో ఆలయ అవశేషాల గుర్తింపు- వారణాసి కోర్టు విచారణకు సుప్రీం బ్రేకులు!
High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది