By: ABP Desam | Updated at : 04 Nov 2021 05:03 PM (IST)
'ఆదిపురుష్' హీరో ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్
'ఆదిపురుష్' చిత్రీకరణ ముగిసింది. కొన్ని అందులో విశేషం ఏముంది? అనుకుంటున్నారా! రికార్డు టైమ్‌లో చిత్రీకరణ పూర్తి చేశాడు దర్శకుడు ఓం రౌత్. సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి అతడు తీసుకున్న సమయం ఎంతో తెలుసా? 102 డేస్. ఓ భారీ సినిమాను 102 రోజుల్లో పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసినట్టు లెక్క.
'బాహుబలి' రెండు భాగాలు పూర్తి చేయడానికి ఎన్నేళ్లు పట్టిందో ప్రేక్షకులకు తెలుసు. 'సాహో' షూటింగ్ డేస్ సైతం ఎక్కువే. 'సలార్', 'ప్రాజెక్ట్ కె'కు ఎన్ని రోజులు పడతాయో ఇప్పుడే చెప్పలేం. ఒక్క ప్రభాస్ సినిమాలు అనే కాదు... స్టార్ హీరోలు చేస్తున్న పాన్ ఇండియా సినిమాలకు 150 కంటే ఎక్కువ షూటింగ్ డేస్ అవసరం అవుతున్నాయి. ఈ తరుణంలో ఓం రౌత్ 102 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయడం విశేషమే కదా!
"చివరి రోజు... చివరి షాట్... వందలకొద్దీ జ్ఞాపకాలు. అయితే, ఈ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. త్వరలో కలుద్దాం డార్లింగ్ ప్రభాస్" అని ఓం రౌత్ ట్వీట్ చేశారు. గతంలో ప్రభాస్ వంద రోజుల్లోపే సినిమా షూటింగ్ పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే... పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత... అతని రీసెంట్ కెరీర్‌లో ఇదొక రికార్డ్ అనే చెప్పాలి.
Last day, last shot and tons of amazing memories but the journey is not over yet!
See you soon darling #Prabhas#Adipurush #AboutLastNight pic.twitter.com/rtB7KahopK — Om Raut (@omraut) November 4, 2021
'ఆదిపురుష్'లో జానకి (సీత) పాత్రలో హిందీ కథానాయిక కృతి సనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 16కి ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేశారు. లంకేశ్ (రావణాసురుడు) పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌ను అయితే కృతి కంటే ముందు సెట్స్ నుంచి పంపేశారు. అక్టోబర్ 9న సైఫ్ పాత్ర చిత్రీకరణ పూర్తయిందని ఓం రౌత్ వెల్లడించారు. చిత్రీకరణ త్వరగా పూర్తి చేసినా... సినిమా పనులు పూర్తి కావడానికి కొంత సమయం ఎదురు చూడక తప్పదు. రామాయణం ఆధారణంగా రూపొందిస్తున్న సినిమా కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. వచ్చే ఏడాది ఆగస్టు 11న సినిమా విడుదల కానుంది. వివిధ భారతీయ, విదేశీ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!
Also Read: ఎనిమీ రివ్యూ: ఈ ఎనిమీ.. యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తాడు
Also Read: ఒక్క పాటకు వెయ్యి మందితో... అల్లు అర్జున్ తగ్గేదే లే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Prey Teaser: ‘ప్రే’ టీజర్ చూశారా? మరింత భయానకంగా ప్రిడేటర్ ప్రీక్వెల్
F3 Movie Ticket Prices: టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదు - క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?
NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్
Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్
AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్