X
Super 12 - Match 22 - 28 Oct 2021, Thu up next
AUS
vs
SL
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 23 - 29 Oct 2021, Fri up next
WI
vs
BAN
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Pawan Kalyan: సినిమాలు ఆపేస్తే కాళ్ల దగ్గరకు వస్తాం అనుకుంటున్నారు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్.. 

సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం 'రిపబ్లిక్'. రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరు లాంఛ్ చేశారు.

FOLLOW US: 

సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం 'రిపబ్లిక్'. రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరు లాంఛ్ చేశారు. ఈ సినిమాను ముందుగా అనుకున్నట్టే చిత్ర యూనిట్ అక్టోబర్ 1న విడుదల చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ గా మాట్లాడారు. 


''తేజ్ సినిమా ఈవెంట్స్ కి ఎప్పుడూ రాలేదు.. దానికి ముఖ్య కారణం ఏంటంటే.. కుటుంబ మీద ఆధారపడకూడదు.. వాళ్ల నిర్ణయాలు వాళ్లే తీసుకునేలా ఉండాలి. కానీ ఈరోజు ఎందుకు వచ్చానంటే.. నిర్మాతలు ఇంత ఖర్చు పెట్టి, సినిమా తీసి.. అందరూ ఆనందంగా ఉండాల్సిన రిలీజ్ టైమ్ లో తేజ్ యాక్సిడెంట్ కి గురి కావడం ఎంతో బాధాకరమైన విషయం. హీరో లేని లోటు ఎంతోకొంత తీర్చాలని ఇక్కడకి వచ్చాను. ట్రైలర్ చూస్తుంటే సినిమా బాగా వచ్చిందని అర్ధమవుతుంది. ఈ మధ్యకాలంలో నాకు బాధ అనిపించింది తేజ్ యాక్సిడెంట్ కి గురైతే.. నిర్మాతలు, దర్శకులు అందరూ వచ్చి తేజ్ కోలుకోవాలని విషెస్ చెప్పారు. మీడియా వారు కూడా కోరుకున్నారు. అందరికీ నా కృతజ్ఞతలు''


మేము కూడా మనుషులమే:


''కొన్ని ప్రోగ్రామ్స్ నేను కూడా చూశాను.. తేజ్ యాక్సిడెంట్ ఎలా అయింది..? చాలా స్పీడ్ లో నడుపుతున్నాడు.. నిర్లక్ష్యంగా నడుపుతున్నాడని కథనాలు వచ్చాయి. దానికి ఒక ఆటోను క్రాస్ చేసి వెళ్లాడు.. అప్పుడు ఎంత స్పీడ్ లో వెళ్తాడు..? 35 లేదా 40 కిలోమీటర్లు. ఇసుక మ్యాట్ వేస్తే దాని మీద జారిపడిపోయాడు.. జాలిపడాలి మనం. అలాంటిది దాని మీద ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా..? కొంచెం కనికరం చూపించండి.. మేము కూడా మనుషులమే.. మీకు కూడా ఇలాంటి పరిస్థితి రాదని గ్యారెంటీ ఏముంది..?''
ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ''దేవకట్టా గారు గతంలో 'ప్రస్థానం' సినిమా తీశారు. 'రిపబ్లిక్'ను కూడా సామాజిక స్పృహతో తీశారు. భారత రాజ్యంగంలో ప్రాధమిక హక్కుల గురించి మాట్లాడే సినిమా అనిపిస్తుంది. 'జై హింద్' అని చెప్పకుండా సభ ముగించలేను. ఎందరో మహానుభావులు త్యాగం చేస్తేనే గానీ ఈ దేశం ఏర్పడింది. రాను రాను పాలిటిక్స్ లో దిగజారుడుతనం వచ్చేసింది'' 


మా వాడు బైక్ మీద నుంచి పడ్డాడంటే అది మావాడి కర్మ: 


''సినిమా పరిశ్రమ అనేది చాలా సెన్సిటివ్. చాలా ఈజీ టార్గెట్ కూడా. తేజు బైక్ మీద నుంచి పడిపోయాడు. అత్యంత వేగంగా వెల్తూ.. ఆటోని ఓవర్ టేక్ చేస్తూ పడిపోయాడని రాస్తున్నారు. అవి కాదు రాయాల్సింది.. వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎలా హత్యకు గురయ్యారని మాట్లాడండి. మా వాడు బైక్ మీద నుంచి పడ్డాడంటే అది మావాడి కర్మ. తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంట్రెస్టింగ్ కథలు చాలానే ఉన్నాయి. కోడి కత్తితో ఒక నాయకుడ్ని పొడిచారు. కేంద్రప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో అలా జరిగింది. అప్పటి గవర్నర్ నరసింహన్ గారు కూడా దీని వెనుక భారీ కుట్ర ఉందని చెప్పారు. దానికి సంగతి ఏమైంది.? ఒక ఆరేళ్ల చిన్నారి చరిత.. అన్యాయంగా, అమానుషంగా హత్యంగా గురైతే అది వదిలేసి.. తేజు 45 కిమీ స్పీడ్ తో వెళ్లాడని స్టోరీ చేస్తున్నారురాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు..? అది స్టోరీ నడపండి. 
ఒక ఆడబిడ్డ బయటకు వెళ్తే తిరిగి సేఫ్ గా ఇంటికి ఎలా రావాలో అది చేయండి స్టోరీ. ఇన్ని సమస్యలు ఉన్నాయి.. కానీ మీరు ఇవ్వరు. సినిమా వాళ్ల గురించి మాట్లాడితే.. ఎవరూ ఏం అనరు.. సాఫ్ట్ టార్గెట్స్. రాజకీయనాయకుల గురించి మాట్లాడితే ఇళ్లల్లోకి వచ్చి కొడతారు. కానీ తేజ్ అమాయకుడు కదా.. ఈరోజు కూడా కళ్లు మూసుకొని పడి ఉన్నాడు.. సమాజానికి పనికొచ్చే విషయాల గురించి మాట్లాడండి''. కాళ్ల దగ్గరకు వస్తాం అనుకుంటున్నారు.. 


''వైసీపీ నాయకులు ఏం అనుకుంటున్నారంటే.. పవన్ కళ్యాణ్ సినిమా ఆపేసినా, ఇండస్ట్రీలో నుంచి వచ్చే సినిమాలు ఆపేస్తే.. వాళ్లందరూ భయపడిపోతారు.. మన కాళ్ల దగ్గరకు వస్తారని.. చాలా తప్పుగా అర్ధం చేసుకున్నారు.''


ఒరేయ్ సన్నాసుల్లారా...? దద్దమ్మల్లారా..? 


''చిత్ర పరిశ్రమలో పని చేసేవాళ్లు ఇన్ని కోట్లు తీసుకుంటున్నారంటూ మాట్లాడుతున్నారు. ఒరేయ్ సన్నాసుల్లారా...? దద్దమ్మల్లారా..? ఉదాహరణకి రెమ్యునరేషన్ గా రూ.10కోట్లు తీసుకుంటే.. దాంట్లో ట్యాక్స్ కట్ చేస్తారు. అప్పుడు మొత్తంగా 6.5 కోట్లు వస్తాయి. ఈ సొమ్ము ఎవడి దగ్గర దోచింది కాదు.. వారి కష్టంతో సంపాదించుకున్నది. మేం అడ్డగోలుగా సంపాదించలేదు.. ఒళ్లు ఇరగ్గొట్టుకొని.. డాన్స్ లు వేస్తూ సంపాదిస్తున్నాం. బాహుబలిలో ప్రభాస్ లా, రానా లా కండలు పెంచితే 'బాహుబలి' అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ లా అద్భుతమైన డాన్స్ లు, రామ్ చరణ్ లా స్వారీలు చేస్తేనే డబ్బులు ఇస్తారు. పక్క రాష్ట్రాల నుంచి హీరోయిన్లు వచ్చి ఇబ్బంది అందరి ముందు డాన్స్ లు చేస్తుంటే ఇస్తున్నారు. అక్రమ ఆర్జిత వారిపై దృష్టి పెట్టండి. సినిమా వాళ్లపై కాదు''


జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందిరా వెధవల్లారా..   


''థియేటర్లు ఉన్నవాళ్లతో వద్దంటే.. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయండి. ఒకసారి పదవిలోకి ముప్పై ఏళ్లు అందులోనే ఉండి సంపాదించుకోవాలనుకుంటున్నారు. అలాంటిది ఒక వ్యాపారికి తన వ్యాపారాన్ని విస్తరించుకోవాలని ఉండదా..? అలా కాకుండా మీకు డబ్బులొద్దు, మాకు డబ్బులొద్దు అంట. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందిరా వెధవల్లారా.. వెల్త్ క్రియేషన్ అనేది జరగకపోతే డబ్బు ఎక్కడనుంచి వస్తుంది..? హీరో నాని రీసెంట్ గా థియేటర్ల గురించి మాట్లాడితే ఆయన్ను తిట్టిపోస్తున్నారు. థియేటర్ల యజమానులంతా ఆ అబ్బాయ్ పై పడితే తనేం చేస్తాడు.. వెళ్లి వైసీపీ నాయకులతో మాట్లాడండి. మీకు నాతో గొడవ ఉంటే నా సినిమాలు ఆపేయండి.. మావాళ్లను వదిలేయండి. ఆ సన్నాసి(పేర్ని నాని)తో మీటింగ్ పెట్టారుగా.. వెళ్లి వాడికి చెప్పండి.. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసి మా సినిమాలకు పర్మిషన్స్ ఇవ్వండి అని. ఇక మన సినిమాలంటారా..? మనల్ని ఆపేదెవరు అక్కడ.. వీళ్లు ఆపుతూ ఉంటే చూస్తూ ఉంటామా..?. ఏపీలో సింగిల్ థియేటర్స్ వెయ్యి ఉంటాయి. ఒక థియేటర్ మెయింటైన్ చేయడానికి ఇరవై మంది పనిచేస్తారు. నా మీద కోపంతో వాళ్ల పొట్టలు కూడా కొడుతున్నారు. సినిమా వాళ్లు వెళ్లి మాట్లాడాలి..? ఒక గుండాకో.. క్రిమినల్ పొలిటిషన్ కో భయపడితే పనులు జరగవు''


ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయొచ్చు.. 


''ప్రకాష్ రాజ్ ని అవుట్ సైడర్ అంటూ మాట్లాడారు. ఆయన ప్రతిభావంతుడైన నటుడు. మాలో మాకు అభిప్రాయబేధాలు ఉంటాయి. కానీ కలిసి పనిచేస్తాం. ప్రకాష్ రాజ్ గారిని లోకల్, నాన్ లోకల్ అని అనొద్దు.. వేరేలా ఎదుర్కోండి. ఆయన్ను తగ్గించి మాట్లాడకూడదు. ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయొచ్చు గెలిపిస్తారో లేదో వేరే సంగతి''


మోహన్ బాబు గారు మీకు నైతిక బాధ్యత ఉంది.. 
''మోహన్ బాబు గారు ఈ విషయంలో మాట్లాడాలి .. మీ బంధువులు కదా.. చిత్రపరిశ్రమను హింసించొద్దని చెప్పండి. మీరు మాజీ పార్లమెంట్ సభ్యులు.. మీకు నైతిక బాధ్యత ఉంది.. మీరు కచ్చితంగా మాట్లాడాలి''


''ఏపీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అందుకే సినిమా టికెట్స్ తీసుకోవాలనుకుంటున్నారు. చిత్రపరిశ్రమలో వచ్చిన సంపాదన గవర్నమెంట్ ఖజానాలోకి వెళ్తే.. అప్పుడు బ్యాంకులకు చూపించొచ్చు మాకు ఇంత ఆదాయం ఉందని చెప్పి లోన్లు తీసుకుంటారు. వారి పథకాలకు ప్రతీ ఒక్కరినీ బలి చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం సినిమాల విషయంలో ఇబ్బంది పెడతారు. కాబట్టి హక్కుతో మాట్లాడాలి.. చిరంజీవి గారికి కూడా చెప్పండి ప్రాధేయపడొద్దని.. ఇది మన హక్కు. ఇండస్ట్రీ పెద్దలంతా కూడా మాట్లాడాలి. తెలుగు చిత్రపరిశ్రమను ఎవరు అడ్డుకోలేరు.. ఆపుకోలేరు.. జై హింద్''


Also Read: 'కొండపొలం' ఇంట్రెస్టింగ్ అప్డేట్.. 'రొమాంటిక్' మూవీ రిలీజ్ డేట్..  


 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
Tags: pawan kalyan power star pawan kalyan Sai Dharam Tej Republic Movie Republic Movie Event

సంబంధిత కథనాలు

Siri Kiss Shanmukh: వామ్మో.. షన్నుకు ముద్దుపెట్టేసిన సిరి, అనీ ఆగ్రహం.. అరె ఏంట్రా ఇది?

Siri Kiss Shanmukh: వామ్మో.. షన్నుకు ముద్దుపెట్టేసిన సిరి, అనీ ఆగ్రహం.. అరె ఏంట్రా ఇది?

Aryan Khan Bail: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు

Aryan Khan Bail: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు

Varudu Kaavalenu: త్రివిక్రమ్ ఓ సీన్ రాశారు! అదెలా ఉంటుందో?

Varudu Kaavalenu: త్రివిక్రమ్ ఓ సీన్ రాశారు! అదెలా ఉంటుందో?

Nagarjuna Meet Jagan : జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !

Nagarjuna Meet Jagan :   జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !

Mahesh Babu's SVP: ముంబైలో తమన్ డ్రమ్మింగ్... హమ్మింగ్... కుమ్మింగ్!

Mahesh Babu's SVP: ముంబైలో తమన్ డ్రమ్మింగ్... హమ్మింగ్... కుమ్మింగ్!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Redmi Note 11 Series: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Redmi Note 11 Series: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!

Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!

Perni Nani : అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !

Perni Nani :  అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ?  కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !

Covid 19 Restrictions: కేంద్రం కీలక నిర్ణయం.. నవంబర్ 30 వరకు కొవిడ్ మార్గదర్శకాలు పొడిగింపు

Covid 19 Restrictions: కేంద్రం కీలక నిర్ణయం.. నవంబర్ 30 వరకు కొవిడ్ మార్గదర్శకాలు పొడిగింపు