By: ABP Desam | Updated at : 25 Sep 2021 07:35 PM (IST)
'కొండపొలం' ఇంట్రెస్టింగ్ అప్డేట్
'కొండపొలం' ఇంట్రెస్టింగ్ అప్డేట్:
టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తోన్న లేటెస్ట్ సినిమా 'కొండపొలం'. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. అడవి నేపథ్యంలో పూర్తి అడ్వెంచరస్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ గ్రామీణ యువతిగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 27న సాయంత్రం 3.33 గంటలకు విడుదలకు చేయనున్నట్లు దర్శకుడు క్రిష్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా వదిలారు. ఇందులో వైష్ణవ్ తేజ్ గొడ్డలి పట్టుకొని ఉండగా.. ఆ గొడ్డలిపై సినిమాలోని కొన్ని పాత్రలు కనిపించాయి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.
Get Ready for @panja_vaishnav_tej @Rakulpreet #KondaPolam "An Epic Tale of Becoming"
Releasing #KondaPolamTrailer on Monday (27 Sep) 3:33 PM#KondaPolamOct8 🎊@mmkeeravaani @gnanashekarvs #Sannapureddy @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/7oKm7TYClw— Krish Jagarlamudi (@DirKrish) September 25, 2021
'రొమాంటిక్' మూవీ రిలీజ్ డేట్:
దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'రొమాంటిక్'. ఈ సినిమాకి పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, రెండు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తోంది.
#ROMANTIC Releasing worldwide on Nov 4th,2021 in Theatres near you✨
— Akash Puri (@ActorAkashPuri) September 25, 2021
Blaze up with the Alluring chemistry between @ActorAkashPuri & #Ketikasharma🥰
And @meramyakrishnan's thumping characterization
💰#PuriJagannadh @Charmmeofficial
🎬#AnilPaduri@PuriConnects#RomanticOnNov4th pic.twitter.com/RSw6m9Oqgr
Also Read: లవ్‌స్టోరీ సమీక్ష: గుండె బరువెక్కించే సందేశం.. ప్రేమకథ రూపంలో..
Watch Video: మీ పాట శాశ్వతం.. మీ మాట శాశ్వతం.. ఇదే మా నీరాజనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?
Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?
Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు